AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: అందుకే ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యింది.. రామ్ చరణ్ చెప్పిన కారణం ఏంటంటే

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో చిరంజీవితోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. కొరటాల శివ అప్పటివరకు సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కంటిన్యూ అవుతున్నారు.

Ram Charan: అందుకే ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యింది.. రామ్ చరణ్ చెప్పిన కారణం ఏంటంటే
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2022 | 5:48 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకులను దారుణంగా  నిరాశ పరిచిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గరం బోల్తాకొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో చిరంజీవితోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. కొరటాల శివ అప్పటివరకు సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కొరటాల అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ సినిమా కంటే ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఆ వెంటనే చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యింది. తాజాగా ఈ సినిమా పై చరణ్ స్పందించారు. తాజాగా మెగా పవర్ స్టా్ర్ ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. వీరిద్దరు సౌత్, నార్త్ పాటలకు డాన్స్ చేసి అలరించారు.

అయితే వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగ్గా..ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. ఈ సందర్భంగా ఆచార్య సినిమా గురించి స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత నేను గెస్ట్ గా నటించిన సినిమా ఆచార్య. ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకున్నా.. ఆచార్య సినిమాను మాత్రం ప్రేక్షకులు థియేటర్స్ లో చూడలేదు అన్నారు చరణ్

అలాగే సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండ ఆదరిస్తారు. ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి అంటే స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. ప్రేక్షకుల టెస్ట్ ఇప్పుడు చాలా మారింది అని అన్నారు చరణ్. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇవి కూడా చదవండి
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!