Aavesham OTT: ఓటీటీలోకి పుష్ప విలన్ కొత్త సినిమా.. ఆవేశం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ప్రస్తుతం విలన్ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్న ఫహాద్.. ఇటీవలే హీరోగా ఆవేశం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మలయాళీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తారా ? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

Aavesham OTT: ఓటీటీలోకి పుష్ప విలన్ కొత్త సినిమా.. ఆవేశం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Fahad Fasil
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2024 | 8:44 AM

బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ నటుడు పహద్ ఫాజిల్. మలయాళంలో హీరోగా అనేక చిత్రాల్లో నటించిన ఫహద్.. ఇప్పుడు విలన్ గానూ రాణిస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలు.. డిఫరెంట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విలన్ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్న ఫహాద్.. ఇటీవలే హీరోగా ఆవేశం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మలయాళీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు నుంచి ఈ సినిమాకు సోషల్ మీడియాలో పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తారా ? అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. గత నెల 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని మే 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ రంగా పాత్రలో తనదైన నటనతో అదరగొట్టేశాడు ఫహాద్. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈసినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో దూసుకుపోతుంది. అయితే దీన్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.