Vithika Sheru-Varun Sandesh: అమెరికాలో జరిగిన ఆ ఘటన.. పిల్లలు కనకపోవడం పై వితికా కామెంట్స్..

పెళ్లి తర్వాత కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న వీరిద్దరు.. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొని తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ షో సమయంలో వితికాపై నెగిటివిటీ ఎక్కువగా వచ్చింది. దీంతో చాలారోజులు డిప్రెషన్ లో ఉండిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబర్ గా మారింది. ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.

Vithika Sheru-Varun Sandesh: అమెరికాలో జరిగిన ఆ ఘటన.. పిల్లలు కనకపోవడం పై వితికా కామెంట్స్..
Vithika Sheru
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2024 | 8:04 AM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు వితికా షేరు. 2009లో ప్రేమించే రోజుల్లో మరి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కథానాయికగా సరైన అవకాశాలు రాకపోవడంతో అటు సెకండ్ హీరోయిన్‏గానూ.. సహాయ పాత్రలలోనూ కనిపించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన భీమిలి సినిమాలో కనిపించింది. 2015లో యంగ్ హీరో వరుణ్ సందేశ్ జోడీగా పడ్డానండీ ప్రేమలో నటించింది. అదే ఏడాది వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న వీరిద్దరు.. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొని తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ షో సమయంలో వితికాపై నెగిటివిటీ ఎక్కువగా వచ్చింది. దీంతో చాలారోజులు డిప్రెషన్ లో ఉండిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబర్ గా మారింది. ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.

ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమాలతో బిజీగా ఉండగా.. యూట్యూబర్ గా రాణిస్తుంది వితికా. కానీ వీరిద్దరి గురించి నిత్యం ఓ ప్రశ్న సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. పిల్లల్నెప్పుడు కంటారు ? అని.. ఎనిమిదేళ్లుగా ఈ ప్రశ్న విని విని విసిగెత్తిపోయానని తెలిపింది వితికా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితికా పిల్లల్ని కనకపోవడంపై రియాక్ట్ అయ్యింది. పిల్లలు అంటే తనకు చాలా ఇష్టమని.. తమ ఫ్యామిలీలోని చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపింది. పిల్లలను కనకపోవడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది.

“2016లో పెళ్లైన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడకు వెళ్లాం. అక్కడే కొంతకాలం ఉన్నాం. 2018లో ప్రెగ్నెంట్ అయ్యాను. అందరికి చాలా సంతోషంగా చెప్పాం. కానీ కొన్నిరోజులకే గర్భస్రావం అయ్యింది. ఇండియాకు వచ్చాకా రెండు నెలలకు మళ్లీ ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే గర్భస్రావం అయ్యిందని చెప్పాను. అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని అన్నారు. మరోసారి అబార్షన్ చేసి గర్భసంచి క్లీన్ చేశారు. ఆ ఘటన తర్వాత మేమిద్దరం బిగ్ బాస్ కు వెళ్లాం. తర్వాత ప్రాజెక్ట్స్ రావడం.. ఫైనాన్సియల్ గా సెటిల్ కావడం జరిగింది. పిల్లలను ఎవరు వద్దనుకుంటారు. ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తాము” అంటూ చెప్పుకొచ్చింది వితికా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.