AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 Movie: ‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు తెలంగాణం ప్రభుత్వం అనుమతి..

మోస్ట్ అవైడెట్ మూవీ పుష్ప 2 వచ్చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఓవైపు చిత్రయూనిట్ వరుస ప్రమోషన్లలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 మూవీ టీంకు శుభవార్త అందించింది.

Pushpa 2 Movie: 'పుష్ప 2' టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు తెలంగాణం ప్రభుత్వం అనుమతి..
Pushpa 2 Movie
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2024 | 2:54 PM

Share

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ పై మరింత హైప్ నెలకొంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న భారీ ఎత్తున విడుదల కానుంది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబైలలో పుష్ప 2 ఈవెంట్స్ జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్ లో జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో తన అభిమానులను బన్నీ కలిసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 మూవీ టీంకు శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మూవీ టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతోపాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా సరే రూ.800గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక అర్దరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీప్లెక్స్ లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.20, మల్టీప్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు. పుష్ప 2 సినిమా మొత్తం ఆరు భాషలలో 12 వేలకు పైగా థియేటర్లలో విడుదలకానుంది. అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదలవుతున్న భారతీయ సినిమా ఇది. సినీడబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలలోనైనా ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు ఉన్నట్లు సమాచారం.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.