Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత.. ఆ రూమర్స్ నిజం కాదట..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి సూపర్ హిట్ తర్వాత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు డార్లింగ్ నటిస్తోన్న రాజసాబ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాపై హైప్ ఏర్పడింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఏంటీ ? అనేదానిపై ఇప్పుడు రకరకాల చర్చ జరుగుతుంది. నిజానికి ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2 చేయాల్సి ఉంది. వీటితోపాటు డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు.
యానిమల్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి ఓ పవర్ పోలీస్ యాక్షన్ డ్రామాను రూపొందించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ అవతారంలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి కొన్ని రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా కాకుండా ప్రశాంత్ వర్మతో చేయబోయే సినిమాలో జాయిన్ అవుతాడని అంటున్నారు. మరోవైపు స్పిరిట్ కంటే ముందు యానిమల్ పార్క్ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నారని టాక్. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు స్పిరిట్ మూవీ నిర్మాత.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా చేసిన తర్వాత యానిమల్ పార్క్ మూవీ తెరకెక్కిస్తాడని అన్నారు. మరో రెండు మూడు నెలల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలిపారు. 2027లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. నిర్మాత భూషన్ కుమార్ ప్రకటనతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఇటలీలో ఉన్న ప్రభాస్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత రాజాసాబ్ మూవీ కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




