Prakash Raj : సాయి పల్లవి వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్.. మోనార్క్ ఏమ్మన్నారంటే
సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు..! బీజేపీ నేతల విమర్శలు, మాటల దాడులు! గోసంరక్షకులు.. హిందుత్వ వాదుల నిరసనలు.. నెట్టింట ట్రోల్లు..! వెరసి సాయి పల్లవిపై ముప్పేట దాడి చేశారు
సాయి పల్లవి(sai pallavi) చేసిన వ్యాఖ్యలు..! బీజేపీ నేతల విమర్శలు, మాటల దాడులు! గోసంరక్షకులు.. హిందుత్వ వాదుల నిరసనలు.. నెట్టింట ట్రోల్లు..! వెరసి సాయి పల్లవిపై ముప్పేట దాడి చేశారు అందరూ..! కాశ్మీరీ పండిట్ల ఊచకోతను గోసంరక్షకుల చేస్తున్న సేవతో ఎలా పోలుస్తావంటూ ఫైర్ అయ్యారు. విప్లవ సాహిత్యం చదివి మైందు పాడైందా ఏంటి అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో తన కాంట్రవెర్సీ మాటలపై స్పందించే టైం ఇది కాదంటూ.. ఓ ఇంటర్య్వూలో మాట దాటేసిన సాయి పల్లవి తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించారు.
మీరు లెఫ్ట్ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్ వింగ్‌కి మద్దతిస్తారా? అని ఓ రిపోర్టర్ అడిగిన క్రమంలోనే తాను వారికి, వీరికి అని కాకుండా ముందు మనం మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతో సమాధానం చెప్పానన్నారు. కానీ, నా మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఏవేవో ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పేఅని.. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ తనకు తెలుసని మరో సారి గట్టిగా చెప్పారు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదంటూ బలంగా స్టేట్మెంట్ ఇస్తూనే తనకు సపోర్ట్‌గా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఙతలు తెలిపారు. అయితే ఇవే మాటలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రకాశ్ రాజ్. “మానవత్వమే అన్నింటికంటే ముందు.. కాబట్టి సాయిపల్లవి.. మేము నీతోనే ఉన్నాం” అని ఒక్క మాటతో.. ఒక్క ట్వీట్తో సాయి పల్లవిని సపోర్ట్ చేశారు ప్రకాశ్ రాజ్. ఆ ట్వీట్తో ఆమెకిచ్చిన సపోర్ట్ తో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి