AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: “మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది”.. ఆసక్తికర విషయం తెలిపిన సరళ సోదరుడు

విరాటపర్వం(Virata Parvam) సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు.

Virata Parvam: మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది.. ఆసక్తికర విషయం తెలిపిన సరళ సోదరుడు
Virata Parvam
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2022 | 4:47 PM

Share

విరాటపర్వం(Virata Parvam) సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా నటించగా ఆయన భావజాలాన్ని , రచనలను ఇష్టపడే యువతిగా సాయి పల్లవి నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 1990లో సరళ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారు. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ ఆదరణ లభిస్తోంది. సరళ అనే యువతి పాత్రలో సాయి పల్లవి నటన అందరిని ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ సినిమాగురించి సరళ సోదరుడు తూము మోహన్ రావు మాట్లాడుతూ.. 30ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సంఘటనని ఇంత గొప్ప చిత్రంగా నిర్మిస్తుందని ఊహించలేదు అన్నారు. వేణు ఉడుగుల గారు కొన్ని నెలలు క్రితం నన్ను కలిశారు. ఈ సినిమా గురించి చెప్పారు. ఎలా చూపిస్తారో అనే భయం ఉండింది. కానీ వేణు గారు చెప్పిన తర్వాత కన్విన్సింగ్ గా అనిపించింది. రానా, సాయి పల్లవి గారి పేరు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. అయితే ఈ సినిమాని ప్రేక్షకుడిగానే అందరితో కలసి చూడాలనుందని చెప్పా. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు. కథ విషయానికి వస్తే.. మా ఇంట్లో కమ్యునిస్ట్ వాతావరణం వుంది. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనై జేషన్ లోకి వెళ్లడం మేము వారించడం జరిగేది. కానీ తను నక్సల్ లోకి వెళ్ళిపోతుందని మేము అనుకోలేదు. దాన్ని ప్రేమించి, ఇష్టంతో వెళ్ళింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావతమై వెళ్ళినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వలనే చనిపోయింది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు.

మా కుటుంబం అంతా కలసి సినిమా చూశాం. నా భార్య ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగింది. ఎప్పుడూ వినని మ్యూజిక్ విరాటపర్వంలో వినిపించిదని చెప్పింది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలికి కంగ్రాట్స్. సాయి పల్లవి, రానా లేకపోతే ఈ సినిమా లేదు. మాకు తెలిసిన కథలో శంకరన్న పాత్ర నెగిటివ్. తన వల్ల చనిపోయింది కాబట్టి కోపం వుండేది. కానీ రానా, సాయి పల్లవిని దర్శకుడు చూపించిన విధానం అద్భుతంగా వుంది. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్ లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. వారికి అభినందనలు. రానా గారు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ప్రయోగాలు ఇక చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను. సురేష్ ప్రొడక్షన్ లో ఇలాంటి డిఫరెంట్ మూవీ మరొకటి రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఇవి కూడా చదవండి
Sarala

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి