RGV Dance Performance: రెచ్చిపోయిన ఆర్జీవీ.. స్టేజ్ పై దద్దరిల్లిపోయేలా డాన్స్..
సంచలనాలకు మారుపేరు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో ఏందో తెలియని ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలు ఎలా ఉన్నపటికీ ప్రేక్షకులు ఆర్జీవీ సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు..

సంచలనాలకు మారుపేరు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో ఏందో తెలియని ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలు ఎలా ఉన్నపటికీ ప్రేక్షకులు ఆర్జీవీ సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. వివాదాస్పద వాస్తవాలను కథలుగా ఎంచుకొని సినిమాలు చేయడం వర్మ స్టైల్. ఎవడైతే నాకేంటి అంటూ తాను నమ్మిందే సినిమాగా తీస్తుంటారు ఆర్జీవీ. మొన్నటి వరకు ఫ్యాక్షనిజం, రాజకీయాల అంశాల చుట్టూ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు తెలంగాణ నక్సలిజం బ్యాగ్రౌండ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. వరంగల్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు కొండా మురళీ, సురేఖల జీవిత కథ ఆధారంగా ‘కొండా’ అనే సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అదిత్ అరుణ్, ఐరా మోర్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే విడుదలైన మొదటి ట్రైలర్ సినిమా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వరంగల్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో చిత్రబృందంతోపాటు కొండా దంపతులు సందడి చేశారు. ఈ ఈవెంట్ భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఆర్జీవీ. సెజ్ పై ఏకంగా తన డాన్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సినిమాలోని ఓ ఎమోషనల్ సాంగ్ కు వర్మ డాన్స్ మూమెంట్స్, ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు, అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జూన్ 23న కొండా సినిమా థియేటర్లలో విడుదల కానుంది.




మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి




