Chor Bazar : చోర్ బజార్ అనేది 400 ఏళ్లుగా ఉంది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత వి.ఎస్ రాజు

యంగ్ హీరో ఆకాష్ పూరి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చోర్ బజార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఆకాష్ పూరి ఇప్పుడు హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

Chor Bazar : చోర్ బజార్ అనేది 400 ఏళ్లుగా ఉంది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత వి.ఎస్ రాజు
Producer Vs Raju
Follow us

|

Updated on: Jun 19, 2022 | 5:48 PM

యంగ్ హీరో ఆకాష్ పూరి(Akash Puri) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చోర్ బజార్(Chor Bazar). చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఆకాష్ పూరి ఇప్పుడు హీరోగా మారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మెహబూబా సినిమాతో హీరోగా మారిన ఆకాష్.. రీసెంట్ గా రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు చోర్ బజార్ సినిమాతో రాబోతున్నాడు. గెహనా సిప్పీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. జీవన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఈనెల 24న యూవీ క్రియేషన్స్ సమర్పణలో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా విషయాలను పంచుకున్నారు నిర్మాత వీఎస్ రాజు.

ఆయన మాట్లాడుతూ.. చోర్ బజార్ అనేది హైదరాబాద్ లో 400 ఏళ్లుగా ఉంది. నిజాం కాలంలో దొంగతనం చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ అలాగే అమ్ముతుంటారు. ప్రతి గురువారం అక్కడ ఈ అమ్మకాలు జరుగుతుంటాయి. నేను మా టీమ్ కూడా చోర్ బజార్ లో వస్తువులు కొన్నాం అన్నారు. అలాగే ఆకాష్ ఈ కథకు పర్పెక్ట్ సరిపోయాడు. కథ విన్నాక ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నాడు. ఈ కథకు రెండు మూడు సినిమాలు చేసిన హీరోనే సరిపోతాడు. ఈ సినిమాతో ఆకాష్ కు మంచి పేరొస్తుంది. హీరోయిన్ పాత్రను మూగగా ఎందుకు పెట్టామనేది సినిమాలో చూడండి. ఇప్పుడున్న సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ఆ పాత్ర ద్వారా ఫన్ క్రియేట్ చేశాం అన్నారు వీఎస్ రాజు. సీనియర్ నటి అర్చన గారు మదర్ పాత్రలో నటించారు. 25 ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. చోర్ బజార్ రాత్రి జరిగే కథ 35 రోజుల వరకు కేవలం రాత్రి షూటింగ్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి అని చెప్పుకొచ్చారు నిర్మాత.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..