AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‏కు ఇక పండగే పండగ.. లైన్‏లో 9 సినిమాలు.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరగా కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు రాజా సాబ్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల పూర్తి జాబితా ఏంటో తెలుసుకుందామా.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‏కు ఇక పండగే పండగ.. లైన్‏లో 9 సినిమాలు.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2025 | 4:57 PM

Share

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యా్ప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న డార్లింగ్.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరగా కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. డార్లింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా సినిమాలు వరుసలో ఉండడంతో కొన్నేళ్లపాటు ప్రభాస్ ఫ్రీ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అంతేకాదు.. ఇప్పటికీ డార్లింగ్ కొత్త కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. మీకు తెలుసా.. ప్రభాస్ చేతిలో మొత్తం 9 సినిమాల వరకు ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు టాక్.

తెలుగు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం తాజాగా ప్రభాస్ ప్రముఖ ప్రోడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట. దర్శకుడి పేరు ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఇప్పటికే ఈ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగే కథలో సైనికుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ప్రభాస్ చేతిలో ఉన్న సినిమా..

  • రాజాసాబ్..
  • ఫౌజీ..
  • స్పిరిట్..
  • కల్కి 2898 ఏడీ పార్ట్ 2
  • సలార్ పార్ట్ 2
  • డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా.
  • ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్.
  • కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్..
  • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మరో సినిమా.

అంతేకాకుండా కేజీఎఫ్ నిర్మాతలు అయిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై దాదాపు మూడు సినిమాలు చేసేందుకు సైన్ చేశాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు. ప్రస్తుతం చేతిలో అత్యధిక సినిమాలు ఉన్న హీరోగా ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
క్లాట్‌ 2026 ఫలితాలు విడుదల.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ చూశారా?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్