OTT Movie: ఏం సినిమా రా బాబూ.. 2 గంటలు నాన్ స్టాప్ ట్విస్టులు.. ఊహించని క్లైమాక్స్.. ఈ కోర్డు డ్రామాను చూస్తే..
థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడనివారుండరు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వాటిలో ఈ సినిమా ఇంకా ప్రత్యేకం. దాదాపు రెండు గంటలపాటు మీకు ఊహించని ట్వి్స్టులు చూపిస్తూ ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేసే సినిమా ఇది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువగా హారర్, థ్రిల్లర్, మిస్టరీ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి జానర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ సైతం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓటీటీ మూవీ లవర్స్ ను అనుక్షణం ఊహించని ట్విస్టులతో సీట్ఎడ్జ్ లో కూర్చొబెట్టే థ్రిల్లర్ సినిమా గురించి తెలుసా.. ? అదే సెక్షన్ 375. 2019లో థియేటర్లలో విడుదలైనఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 2 గంటల 5 నిమిషాల పాటు కోర్డ్ రూమ్ డ్రామా.. ఒక మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను చూస్తున్నంతసేపు థ్రిల్ ఇస్తుంది. ముఖ్యంగా మూవీ క్లైమక్స్ మాత్రం అదిరిపోతుంది.
ప్రస్తుతం ఐఎండీబీలో ఈ సినిమాకు 8.1 రేటింగ్ ఉంది. సినిమా కథ విషయానికి వస్తే.. సెక్షన్ 375 సినిమాను డైరెక్టర్ అజయ్ బహల్ తెరకెక్కించారు. ఒక కాంట్రవర్షియల్ ఆధారంగా వచ్చిన ఈ లీగల్ డ్రామా.. ఫేమస్ ఫిలింమేకర్ రోహన్ ఖురానా (రాహల్ భట్ పోషించిన పాత్ర).. తన దగ్గర పనిచేసే జూనియర్ కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి డాంగే (మీరా చోప్రా )పై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఈకేసులో అతడికి శిక్ష పడగా.. కోర్టు తీర్పును సవాలు చేస్తూ. టాప్ డిఫెన్స్ లాయర్ తరుణ్ సలూజా (అక్షయ్ ఖన్నా) ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమా మొత్తం కోర్డు రూంలోనే నడుస్తుంది. ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రాసిక్యూటర్ హీరల్ గాంధీ (రిచా చద్దా) పోరాటం.. డిఫెన్ లాయర్ సలూజా పోరాటమే ఈ సినిమా.
కోర్డులో నిజాలు, ఎమోషన్స్, వాదానలు ఎలా తారుమారు అవుతాయో కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీలో వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ మూవీ దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..




