AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: “రాధే శ్యామ్” సినిమా నుంచి రాయబోయే సూపర్ సర్‌ప్రైజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాన్స్..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి.

Radhe Shyam: రాధే శ్యామ్ సినిమా నుంచి రాయబోయే సూపర్ సర్‌ప్రైజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాన్స్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2021 | 6:08 PM

Share

Radhe Shyam: ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదలైంది. గుండె ఒక్కటే అయినా.. రెండు చప్పుళ్ళు ఉంటాయంటూ రాధే శ్యామ్ యూనిట్ ఓ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ పరదా చాటున ఎంతో అద్భుతంగా ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధే శ్యామ్‌”. ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు. ఇది గొప్ప ప్రేమ‌క‌థ అని మెష‌న్ పోస్ట‌ర్‌తోనే రివీల్ అయ్యింది.

మొనీమధ్య విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్.. ఈ రాతలే పాటకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రాతలే పాటకు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాసింది ఈ పాట. అలాగే ఈ పాటలో పంచభూతాలను కలిపి చూపించారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్. తాజాగా ఈ సినిమా “One Heart.. Two HeartBeats.. పోస్టర్ విడుదలైంది. అంటే ఒకే సినిమానే అయినా కూడా రెండు భాషలకు కనెక్ట్ అయ్యేలా అద్భుతమైన సంగీతం అందించబోతున్నారని దీని అర్థం. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో 29 న‌వంబ‌ర్ సాయంత్రం 7 గంల‌కు, రాధేశ్యామ్ మ్యూజిక్ ఆల్బ‌మ్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ న‌గుమోము తార‌లే టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌డానికి రంగం సిధ్ధం అయింది. ఇది ఇలా ఉండ‌గా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ డార్లింగ్‌ని సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేశారు. దీనికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. హిందీ వర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఒకే గుండెకు రెండు చప్పుళ్లు అనే పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది.

Radheshyam

Radheshyam

మరిన్ని ఇక్కడ చదవండి : 

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ సీన్ల‌ను లోతుగా చూస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంది : రాజమౌళి

Alia Bhatt: నెటిజన్ల మనసు గెల్చుకున్న అలియా.. అభిమానిని గుర్తు పెట్టుకుని పలకరించిన బాలీవుడ్‌ నటి..

Ananya Panday : లాస్‌ వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న లైగర్‌.. ఫొటోలు షేర్‌ చేసిన అనన్య..