Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ఇన్ స్టాలో డార్లింగ్ అకౌంట్ మిస్సింగ్.. హ్యాక్ అయ్యిందా ?.. డీయాక్టివేట్ చేశారా ?..
ప్రస్తుతం హ్యాక్ అయిన అకౌంటును తిరిగి తీసుకువచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అకౌంట్ మిస్సయిందా ?.. లేదా డీయాక్టివేట్ చేశారా ?.. అనేది తెలియరాలేదు. కొందరు అభిమానులు మాత్రం ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ స్వయంగా డీయాక్టివేట్ చేశాడేమో అని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నిజానికి డార్లింగ్ సోషల్ మీడియాలో చాలా దూరంగా ఉంటారు. కేవలం ఫేస్ బుక్, ఇన్ స్టా మాత్రమే అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటారు.

యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఇన్ స్టాలో ప్రభాస్ అకౌంట్ మిస్సయ్యింది. అవును.. మీరు చదువుతున్నది నిజమే. ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే అసలు ఏ ఖాతా చూపించడం లేదు. కేవలం ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పేజెస్ మాత్రమే చూపిస్తున్నాయి. డార్లింగ్ ఒరిజినల్ అండ్ అఫీషియల్ అకౌంట్ మాత్రం మిస్ అయ్యింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆయన అభిమానులు సైతం ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హ్యాక్ అయిన అకౌంటును తిరిగి తీసుకువచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అకౌంట్ మిస్సయిందా ?.. లేదా డీయాక్టివేట్ చేశారా ?.. అనేది తెలియరాలేదు. కొందరు అభిమానులు మాత్రం ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ స్వయంగా డీయాక్టివేట్ చేశాడేమో అని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నిజానికి డార్లింగ్ సోషల్ మీడియాలో చాలా దూరంగా ఉంటారు. కేవలం ఫేస్ బుక్, ఇన్ స్టా మాత్రమే అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటారు. ఈ రెండు ఖాతాలలో కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే పంచుకుంటారు. ప్రభాస్ కు ఇన్ స్టాలో దాదాపు కోటి మంది అంటే పది మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ప్రభాస్ ఇన్ స్టా అకౌంట్ మిస్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సలార్ మూవీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివర డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.