Sai Dharam Tej: లోకల్ మ్యాన్.. ఊర మాస్ లుక్‏లో సాయి ధరమ్ తేజ్.. ‘గాంజా శంకర్’ గ్లింప్స్ చూశారా ?..

ఇటీవలే బ్రో సినిమాతో థియేటర్లలో అలరించాడు. తొలిసారిగా తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తేజ ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అంతేకాదు.. ఇందులో పక్కా ఊరమాస్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో

Sai Dharam Tej: లోకల్ మ్యాన్.. ఊర మాస్ లుక్‏లో సాయి ధరమ్ తేజ్.. 'గాంజా శంకర్' గ్లింప్స్ చూశారా ?..
Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 15, 2023 | 10:48 AM

విరూపాక్ష సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. వెంట వెంటనే కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇటీవలే బ్రో సినిమాతో థియేటర్లలో అలరించాడు. తొలిసారిగా తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న తేజ ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అంతేకాదు.. ఇందులో పక్కా ఊరమాస్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ మూవీ గ్లింప్స్ అధికారికంగా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ.. వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

“చిన్నప్పుడే స్కూల్ ఎగ్గొట్టేసి.. అమ్మానాన్నల మాటలను పెడచెవిన పెట్టి.. అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ.. అన్ని చెడు అలవాట్లను ఒంటికంటించుకుని .. పది రూపాలయలుంటే పార్కులో.. పది వేలుంటే పార్క్ హయత్ లో ఉండే ఒక అల్లర చిల్లగా పెరిగిన మనిషి కథ ” అంటూ ఈ వీడియోలో చెప్పడం కనిపిస్తుంది. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ పక్కా ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాత కావడంతో అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి మాస్ హీరోగా కనిపించనున్న సాయి ధరమ్ తేజ్.. గాంజా శంకర్ సినిమాతో మరో హిట్ అందుకోవడం ఖాయంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో తేజ జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బలగం సినిమాతో హిట్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని వివరాలను అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న