Prabhas: కల్కి కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడా..? ఎంత తీసుకున్నాడంటే..

కలియుగాంతానికి.. మహా భారతానికి లింక్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్, ట్విస్టులు, ఊహించని పాత్రలకు ఫిదా అవుతున్నారు. ఇక ఇందులో అమితాబ్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్, క్లైమాక్స్ గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రాల్లో ది బెస్ట్ మూవీ అంటూ.. నాగ్ అశ్విన్ విజన్ వేరెలెవల్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Prabhas: కల్కి కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడా..? ఎంత తీసుకున్నాడంటే..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2024 | 12:39 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‍గా దూసుకుపోతున్న చిత్రం కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ మూవీ చూసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్. కలియుగాంతానికి.. మహా భారతానికి లింక్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్, ట్విస్టులు, ఊహించని పాత్రలకు ఫిదా అవుతున్నారు. ఇక ఇందులో అమితాబ్, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్, క్లైమాక్స్ గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రాల్లో ది బెస్ట్ మూవీ అంటూ.. నాగ్ అశ్విన్ విజన్ వేరెలెవల్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజే రూ.180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాహుబలి1,2 తర్వాత ఆ రేంజ్ లో హిట్ అందుకున్నాడు ప్రభాస్.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ సినిమాకు ప్రభాస్ అత్యధికంగా రూ.150 కోట్లు పారితోషికం తీసుకున్నాడని ముందు నుంచి వినిపిస్తున్న టాక్. అయితే తాజా నివేదికల ప్రకారం నిజానికి కల్కి 2898 ఏడి సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట కల్కి కోసం ప్రభాస్ కేవలం రూ.80 కోట్లు మాత్రమే తీసుకున్నాడని సమాచారం. అయితే డార్లింగ్ పారితోషికం తగ్గించుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అయితే సినిమా బడ్జెట్ కోసమే ప్రభాస్ ఇలా తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడని అంటున్నారు.

మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం ఇది మొదటిసారి కాదు. 2025లో విడుదల కానున్న రాజాసాబ్ సినిమాకు కూడా తక్కువే పారితోషికం తీసుకుంటున్నాడట. నిజానికి ఈ సినిమాకు అసలు పారితోషికం తీసుకోవడం లేదని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కానీ దీనిపై స్పష్టంగా క్లారిటీ రాలేదు. కానీ ఇకపై తనకు రాబోయే సినిమాలకు కూడా ప్రభాస్ తక్కువే పారితోషికం తీసుకోవాలని భావిస్తున్నాడట. దీంతో డార్లింగ్ డెసిషన్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ చిత్రాలకు రూ.100 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే కల్కి సినిమాకు అమితాబ్ బచ్చన్ రూ.18 కోట్లు, కమల్ హాసన్ రూ.20 కోట్లు, దిశా పటానీ రూ.2 కోట్లు, దీపికా రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.