AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : స్పిరిట్ షూటింగ్ అప్డేట్.. ప్రభాస్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరగా కల్కి 2898 ఏడీ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చిన డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న రాాజాసాబ్ సినిమాపై మంచి క్యూరియాసిటీ నెలకొంది.

Prabhas : స్పిరిట్ షూటింగ్ అప్డేట్.. ప్రభాస్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే.
Spirit Movie
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2025 | 8:57 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ డమ్ సంపాదించుకున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న డార్లింగ్.. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవే కాకుండా డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా స్పిరిట్. యానిమల్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ నెలాఖరున ఈ మూవీ పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి నటించనున్నట్లు ఇదివరకే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ విదేశాల్లో జరగనుందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో సందీప్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాల్లో లొకేషన్స్ పరిశీలించారని టాక్. అయితే ప్రస్తుతం రాజాసాబ్ , ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఈ రెండు సినిమాలు ముగించిన తర్వాత స్పిరిట్ సెట్స్ లో అడుగుపెట్టనున్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

సెంచరీతో చెలరేగిన గంటల్లోనే ఆసుపత్రి బెడ్ పై జైస్వాల్
సెంచరీతో చెలరేగిన గంటల్లోనే ఆసుపత్రి బెడ్ పై జైస్వాల్
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్.. రాత్రి వరకు తిరిగి రాలేదు..
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్.. రాత్రి వరకు తిరిగి రాలేదు..
బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా?
బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..