చిత్రపరిశ్రమను వదిలిపెట్టని ఏజ్ గ్యాప్ ఇష్యూ.. యంగ్ బ్యూటీ ఫైర్ !
ఏజ్ గ్యాప్.. ఈ ఇష్యూ ఇప్పట్లో వదిలేలా లేదు.. ఏ సినిమా అనౌన్స్ అయినా.. ఏ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్లకు వచ్చినా... వెంటనే యాక్టివ్ అవుతోంది ఏజ్ గ్యాప్ ఇష్యూ. ఇండస్ట్రీలో ఈ మధ్య మరింతగా వినిపిస్తున్న ఏజ్ గ్యాప్ గురించి ఇప్పుడు స్పందించారు మాళవిక మోహనన్. ఇంతకీ ఆమె ఎందుకు స్పందించాల్సి వచ్చింది.. ఇంతకు ముందు ఈ ఇష్యూ మీద మాట్లాడిన వాళ్లెవరు? కమాన్ లెట్స్ వాచ్...
Updated on: Aug 14, 2025 | 8:37 PM

సోషల్ మీడియా గ్లామర్‌తో తెలుగువారికి బాగా దగ్గరైన నటి మాళవిక మోహనన్. అడపాదడపా కొన్ని అనువాద సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించారు మాళవిక. రాజాసాబ్ తెలుగులో ఆమె ఫస్ట్ వెంచర్. ఇప్పుడు ఆమె మలయాళంలో లాల్ ఏట్టన్ మోహన్‌లాల్‌తో ఓ సినిమా చేస్తున్నారు.రీసెంట్‌గా ఆమె పుట్టినరోజు సందర్బంగా లాల్ ఏట్టన్ హృదయపూర్వం మూవీ నుంచి ఫొటోలు రిలీజ్ అయ్యాయి.

అప్పటి నుంచీ నెగటివిటీని ఫేస్ చేస్తున్నారు మాళవిక మోహనన్. అరవైల్లో ఉన్న మోహన్‌లాల్‌కీ, 30ల్లో ఉన్న మాళవికకి జోడీ ఎందుకు కుదురుతుంది? స్క్రీన్ మీద ఎందుకు నేచురాలిటీని చూపించరు అన్నది విమర్శకుల వాదన. అందులో తప్పేం ఉంది? మీరు ఇలా చూడ్డం, మాట్లాడటం ఆపేయండి.. సినిమాను సినిమాగా చూడటం నేర్చుకోండని అంటున్నారు మాళవిక. గతంలో ఇదే విషయం మీద స్పందించారు శ్రుతిహాసన్.

మెగాస్టార్ చిరంజీవితోనూ, నందమూరి బాలకృష్ణతోనూ శ్రుతిహాసన్ జోడీ కట్టినప్పుడు కూడా ఇలాంటి టాపిక్కే వచ్చింది తెరమీదకు. రియల్ ఏజ్‌ని స్క్రీన్ ఏజ్‌తో కంపేర్ చేయడం ఆపేయండి అని నిక్కచ్చిగా చెప్పేశారు శ్రుతిహాసన్.

రీసెంట్‌గా త్రిష కూడా ఇలాంటి ఇష్యూనే ఫేస్ చేశారు. కమల్‌హాసన్‌తో త్రిష జోడీ ఎందుకు? అని నెట్టింట్లో ప్రశ్నలు తలెత్తాయి. అవి ఫిక్షనల్ కేరక్టర్స్. వాటిని అలాగే చూడాలి తప్ప, ఇలాంటి మీనింగ్ లెస్ లాజిక్కులు ఎందుకు అని కొట్టిపారేశారు మణిరత్నం. హీరోలకు ఏజ్ అవుతున్న కొద్దీ, హీరోయిన్లను వెతికిపట్టుకోవడం ఓ ఇబ్బందిగా మారుతుంటే, ఆ తర్వాత వచ్చే ఇలాంటి ఇష్యూస్ మరింత చిరాకు తెప్పిస్తున్నాయన్నది మేకర్స్ వైపు నుంచి వినిపిస్తున్న మాట.




