- Telugu News Photo Gallery Cinema photos Actor Ponnambalam Says Megastar Chiranjeevi Helps Rs 1 crore for medical treatment
Ponnambalam: 750కు పైగా ఇంజెక్షన్లు.. ఆయనే రూ. కోటి సాయం చేశారు.. ఎమోషనలైన పొన్నాంబళం
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారు 1500 కు పైగా సినిమాల్లో నటించాడు పొన్నాంబళం. తన నటనతో ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. అయితే ఆ మధ్యన పొన్నాంబళం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
Updated on: Aug 15, 2025 | 11:21 AM

. స్టంట్‌మ్యాన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు పొన్నాంబళం. ఆ తర్వాత దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే పవర్ ఫుల్ విలన్ గా ఓ వెలుగు వెలిగారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కలిపి సుమారు 1500 వందలకు పైగా చిత్రాల్లో నటించారు పొన్నాంబళం.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, రజనీకాంత్ , కమలహాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారాయన. సినిమాల్లో సక్సెస్ అయిన పొన్నాంబళం నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు.

తీవ్ర ఆర్థిక సమస్యలకు తోడు కొన్నేళ్ల క్రితం మూత్ర పిండాల వ్యాధి బారిన పడ్డారు పొన్నాంబళం. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పొన్నాంబళంకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.

అయితే ఇటీవలే మళ్లీ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారీ నటుడు. ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకుననాడు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటోన్న పొన్నాంబళం తాజాగా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'కిడ్నీ సమస్య రాగానే ఎవరైనా సాయం చేస్తారేమోనని ఎదురుచూశాను. చిరంజీవికి మెసేజ్ పెడితే అన్నయ్య వెంటనే ఫోన్ చేశారు. హైదరాబాద్‌కు రమ్మంటే కష్టమని చెప్పడంతో చెన్నై అపోలోలో అడ్మిట్ అవమన్నారు. ఎంట్రీ ఫీజు లేకుండానే నన్ను అడ్మిట్ చేసుకున్నారు.

నా ట్రీట్‌మెంట్‌కు రూ.40 లక్షలు అన్నయ్యే భరించారు. నేను అడగ్గానే ఓ లక్షో, రెండు లక్షలో ఇస్తారనుకున్నా.. కానీ అన్నయ్య అంతకుమించి సాయం చేశారు. ఇప్పటివరకు నాకు కోటి రూపాయల దాకా చిరంజీవి సాయం చేశారు' అని ఎమోషనల్ అయ్యాడు పొన్నాంబళం.




