AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Hara Veera Mallu: స్పీడ్ పెంచిన హరి హర వీర మల్లు టీమ్.. 200 మందితో పవన్ షూటింగ్..

తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Hari Hara Veera Mallu: స్పీడ్ పెంచిన హరి హర వీర మల్లు టీమ్.. 200 మందితో పవన్ షూటింగ్..
Harihara Veeramallu
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2024 | 10:48 AM

Share

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

ఇటీవల చిత్ర బృందం, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించింది. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 – 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. ఈ యుద్ధ సన్నివేశం అద్భుతంగా రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషంగా ఉంది. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఏంటీ..!ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్యా..! అందాలతో గత్తరలేపిందిగా..

ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ తో ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని, యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన టీజర్ ని అందించడంతో పాటు, పవన్ కళ్యాణ్ అభిమానులు అనందించేలా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తూ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడటంలో జ్యోతి కృష్ణ కీలక పాత్ర పోషించారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, బాహుబలి ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.

ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..