Rishab Shetty: మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో రిషబ్ శెట్టి కొత్త సినిమా.. జై హనుమాన్ తర్వాత ఇదే

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో రిషబ్‌ ఓ సినిమాలో నటిస్తాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత తెలుగులో 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కొత్త సినిమా 'జై హనుమాన్'లో రిషబ్ నటించడం కన్ఫర్మ్ అయి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Rishab Shetty: మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో రిషబ్ శెట్టి కొత్త సినిమా.. జై హనుమాన్ తర్వాత ఇదే
Rishab Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2024 | 10:49 AM

‘కాంతార’ సినిమా విజయంతో రిషబ్ శెట్టికి వరుస అవకాశాలు  వస్తున్నాయి. ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రిషబ్ శెట్టికి.. ఇప్పుడు వివిధ భాషా చిత్రాల నుంచి అనేక అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో రిషబ్‌ ఓ సినిమాలో నటిస్తాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత తెలుగులో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ‘జై హనుమాన్’లో రిషబ్ నటించడం కన్ఫర్మ్ అయి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు రిషబ్ శెట్టికి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు హీరో.. రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

రాజమౌళి ‘బాహుబలి 1,2’, ‘ఈగ’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్నారని తెలుస్తోంది. అశ్విన్ గంగరాజు ఇప్పటికే  ‘ఆకాశవాణి’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి కొద్ది రోజుల్లో రిషబ్ శెట్టితో ఆయన కొత్త సినిమా ప్రకటించనున్నారు. పీరియాడికల్ స్టోరీతో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రిషబ్ శెట్టి సోలో హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమా క్యారెక్టర్ ఇంకా రివీల్ కాలేదు. కథలోని బలం, కొత్తదనం మెచ్చి రిషబ్ శెట్టి సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర పాత్రల ఎంపిక జరుగుతోంది.

ఏంటీ..!ఈవిడ చంద్రముఖిలో వడివేలు భార్యా..! అందాలతో గత్తరలేపిందిగా..

తెలుగులో విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘జెర్సీ’, ‘భీష్మ’, ‘టీజే టిల్లు’ ఇటీవల విడుదలైన ‘లక్కీ భాస్కర్’ మరెన్నో చిత్రాలను నిర్మించింది సితార ఎంటర్‌టైన్‌మెంట్. రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతార చాప్తర్ 1’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సినిమా క్లైమాక్స్‌  చిత్రీకరణ జరుగుతోంది. రిషబ్ శెట్టి ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషన్స్ తో పని చేస్తున్నాడు. దీని తర్వాత తెలుగులో ‘జై హనుమాన్’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రిషబ్ శెట్టి ఓ సినిమాలో నటించనున్నాడు.

ఇవి కూడా చదవండి

అయ్యో పాపం..! రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
స్నానానికి వెళ్లి బాత్రూమ్‌లో నవవధువు మృతి.. ఏం జరిగిందంటే.!
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌