AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashu Reddy: అషురెడ్డిపై పోలీస్ కేసు.. ప్రేమ, పెళ్లి పేరుతో కోట్లు కాజేసిందంటున్న ఎన్ఆర్ఐ

నటి అషురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. పెళ్లి పేరుతో తన దగ్గర రూ.9.35 కోట్లు కాజేసిందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కార్లు, బంగారం, ఫ్లాట్లు కొనుక్కుని ముఖం చాటేసిందన్న ధర్మేంద్ర అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీసీఎస్ పోలీసులు

Ashu Reddy: అషురెడ్డిపై పోలీస్ కేసు.. ప్రేమ, పెళ్లి పేరుతో కోట్లు కాజేసిందంటున్న ఎన్ఆర్ఐ
Ashu Reddy
Rajeev Rayala
|

Updated on: Apr 26, 2026 | 7:14 AM

Share

నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై కేసు ఫైల్ అయ్యింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర 9 కోట్ల 35 లక్షల రూపాయిలు కాజేసిందంటూ లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ధర్మేంద్ర హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందిన వైవి ధర్మేంద్ర సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ లండన్‌లో స్థిరపడ్డాడు. 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషురెడ్డి తనకు పరిచడమైందని… అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్టు చెప్పిందని కంప్లైంట్‌లో తెలిపాడు.

ఇది కూడా చదవండి : RGV: స్టార్‌లా ఫీల్ అవ్వకు.. దెబ్బైపోతావ్ అని అతని అప్పడే చెప్పా.. వినలేదు

పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని… పెళ్లి చేసుకుందామని నమ్మించిందని ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడుగుతూ.. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరిటే రిజిస్టర్‌ చేయించుకుందన్నాడు. అషురెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లి పేరుతో హడావుడి చేసి కొన్నాళ్ల తర్వాత ముఖం చాటేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2025 వరకు తన కుమారుడి నుంచి దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయిలు అషురెడ్డి తీసుకుందని ధర్మేంద్ర తండ్రి కూడా చెబుతున్నారు. 35 కోట్ల విలువ చేసే నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్‌లు,కార్లు కొనుగోలు చేయించుకుందన్నారు. ఇక ధర్మేంద్ర ఫిర్యాదుపై సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట

అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసి మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫొటోలతో, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. కాగా తాజాగా వచ్చిన ఆరోపణల పై అషు రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి : OTT Movie : పాడుబడ్డ కాలేజ్‌లో బాధతో విలవిలలాడే ఆత్మ.. సినిమా వచ్చి 25ఏళ్లు.. చూస్తే ఇప్పటికీ తడిసిపోతుంది

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us