AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : పాడుబడ్డ కాలేజ్‌లో బాధతో విలవిలలాడే ఆత్మ.. సినిమా వచ్చి 25ఏళ్లు.. చూస్తే ఇప్పటికీ తడిసిపోతుంది

హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది భయపెట్టె దెయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. మరికొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి.

OTT Movie : పాడుబడ్డ కాలేజ్‌లో బాధతో విలవిలలాడే ఆత్మ.. సినిమా వచ్చి 25ఏళ్లు.. చూస్తే ఇప్పటికీ తడిసిపోతుంది
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2026 | 10:23 AM

Share

కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎప్పడూ వెంటాడుతూ ఉంటాయి. ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఎన్నో క్రేజీ సినిమాలు వచ్చాయి. రకరకాల జోనర్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. హారర్, రొమాంటిక్, థ్రిల్లర్, లవ్ స్టోరీ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. ఇక ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల సినిమాలు అదరగొడుతున్నాయి. ఓటీటీల్లో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల్లో హారర్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ హారర్ సినిమా చూస్తే ఇప్పటికీ తడిసిపోతుంది.

ఇది కూడా చదవండి: డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!

ఓటీటీల పుణ్యమా అని ఏళ్ల క్రితం విడుదలైన సినిమాలు కూడా ఇప్పుడు తిరిగి ఓటీటీలో అదరగొడుతున్నాయి. పాత సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు ఆడియన్స్. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా విడుదలై 25ఏళ్లు అవుతుంది. 2000వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం, అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఒక పాత మ్యూజిక్ కాలేజ్ నేపథ్యంలో సాగుతుంది. అక్కడి రహస్యాలను ఛేదించే క్రమంలో సాగుతుంది. ఈ సినిమాలో ప్రతి సీన్ వెన్నులో వణుకుపుట్టిస్తుంది.

ఇది కూడా చదవండి: ఎంత పని చేశావ్ సామి..!! రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాకు నో చెప్పిన నటుడు..

అయితే ఈ సినిమాలో భయపెట్టే దెయ్యాలు, భూతాలు అలాంటివి ఉండవు కానీ.. ఒక ఆత్మ తన బాధను మ్యూజిక్ రూపంలో చెప్తుంది. హీరో ఆ ఆత్మను ఎలా కనిపెట్టాడు. ఆ ఆత్మ ఎందుకు అంత బాధను అనుభవిస్తుంది. అసలు ఎవరు ఆ ఆత్మ అన్నది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా పేరు దేవదూతన్. ఈ హారర్ సినిమా మలయాళంలో తెరకెక్కింది. స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో చాలా విశేషాలు ఉంటాయి. హారర్ సీన్స్ కంటే సంగీతం భయపెడుతుంది. సౌండింగ్, లైటింగ్, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో భయపెట్టే సన్నివేశాలే కాదు గుండెను బరువెక్కించే విఫలమైన లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. హారర్ థ్రిల్లర్ సినిమాను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఆమెకు రోజుకు 50సార్లు ఐ లవ్ యూ చెప్పేవాడ్ని.. ఆ హీరోయిన్ కోపంతో వెళ్ళిపోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us