Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం
US President Donald Trump: వాషింగ్టన్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో జరుగుతున్న 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్' (WHCA) వార్షిక విందు కార్యక్రమంలో కాల్పుల శబ్దం వినిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వేదికపై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సీక్రెట్

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపపై హత్యాయత్నం జరిగింది. వైట్ హౌస్ సమీపంలోని హోటల్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. కరస్పాండెంట్స్ డిన్నర్ హాలులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ సహా కీలక నేతలు సుక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో భద్రతా బలగాలు హోటల్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు.
అయితే వాషింగ్టన్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో జరుగుతున్న ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’ (WHCA) వార్షిక విందు కార్యక్రమంలో కాల్పుల శబ్దం వినిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వేదికపై ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణమే అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే కార్యక్రమం జరుగుతుండగా హఠాత్తుగా పెద్ద శబ్దాలు వినిపించడంతో, భద్రతా కారణాల దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఇతర సీనియర్ నాయకులను సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే అక్కడి నుంచి తరలించారు.
అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, శబ్దాలు వినబడగానే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతిథుల గుండా వేదిక వైపు దూసుకెళ్లారు. ఆ సమయంలో “అయ్యా, దారిలోంచి తప్పుకోండి!” అని అధికారులు అరుస్తూ అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. వైట్ హౌస్‌పై కాల్పులు జరిగాయని, అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఒక క్యాబినెట్ సభ్యుడు ఏఎఫ్‌పీ (AFP) వార్తా సంస్థకు తెలిపారు.

Donald Trump
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలలో పెద్ద శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నప్పటికీ, వాటి ప్రామాణికత ఇంకా ధృవీకరించలేదు. ఈ ఘటన తర్వాత వెంటనే కార్యక్రమాన్ని నిలిపివేసి, వేదికను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినిపించిన శబ్దాలు నిజంగా తుపాకీ కాల్పులా లేక మరేదైనా సాంకేతిక కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలను లేవనెత్తింది. ప్రస్తుతం అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. అయితే ట్రంప్‌పై 5-8 రౌండ్ల కాల్పులు జరిగినట్లు భద్రతా బలగాలు గుర్తించారు. నిందితుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
కాల్పులు జరిపినప్పుడు అక్కడే ఉన్నా- పాల్
ఇదిలా ఉండగా, ట్రంప్‌పై కాల్పులు జరిగిన సమయంలోనే అదే హోటల్‌లో తాను బస చేసినట్లు కేఏ పాల్ తెలిపారు. కాల్పుల సమయంలో హోటల్‌లోనే ఉన్నానని పాల్ మీడియాకు వెల్లడించారు. యుద్ధం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
#WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents’ Dinner after shots were reportedly fired at the event.
(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Z2nDjWzWW0
— ANI (@ANI) April 26, 2026
ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ
ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ దాడిని ఖండించారు. “ఈ దాడి గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను. ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసి ఊరట చెందాను” అని అన్నారు.
Relieved to learn that President Trump, the First Lady and Vice President are safe and unharmed following the recent security incident at a Washington DC hotel. I extend my best wishes for their continued safety and well-being. Violence has no place in a democracy and must be…
— Narendra Modi (@narendramodi) April 26, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
