AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట

నటి లైలా, 90వ దశకంలో తన సొట్టబుగ్గలతో కూడిన అందమైన నవ్వుతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1978 అక్టోబర్ 24న గోవాలోని పంజీలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన లైలాకు, పైలట్ అవ్వాలనే కోరిక ఉండేది. ఆమె తల్లిదండ్రులు ఆమెను గారాబంగా పెంచారు.

Laila: వింత వ్యాధితో బాధపడుతున్న లైలా.. 30 సెకన్లు కూడా కంట్రోల్ చేసుకోలేదట
Laila
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2026 | 11:32 AM

Share

ఒకప్పుడు తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న భామల్లో లైలా ఒకరు. ఈ అమ్మడు తన అందం, అమాయక చూపులతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లైలా స్మైల్ కు ఎవ్వరైనా పడిపోవాల్సిందే.. తెలుగు తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్ లో ఉండగానే ఈ ముద్దుగుమ్మ సినిమాకు బ్రేక్ ఇచ్చింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తుంది. ఆ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కొన్ని సినిమాల్లో మెరిసింది కానీ అనుకున్నంతగా బిజీగా కాలేదు ఈ అమ్మడు. అయితే మొదట్లో పైలెట్ అవ్వాలనుకుంది ఈ చిన్నది అయితే, ఆమె తల్లికి లైలా వెండితెరపై మెరిసిపోవాలని బలమైన కోరిక ఉండేది. మేకప్, మోడలింగ్, నటనపై ఆసక్తి లేకపోయినా, తల్లి కోరిక మేరకు లైలా 15 ఏళ్ల వయస్సు నుంచే ర్యాంప్ వాక్స్, చిన్న చిన్న ప్రకటనలలో నటించడం ప్రారంభించారు. ముంబైకి మకాం మార్చిన తర్వాత, లైలా తల్లి ఆమెను నటన కోర్సుల్లో చేర్చి, బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించారు. దుష్మన్ దునియా కా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.

ఇది కూడా చదవండి: డార్లింగ్ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు.. నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!

మలయాళ చిత్రాలలో కూడా అపజయాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఎగిరే పావురమా చిత్రం కోసం ఆమెను ఎంపిక చేశారు. ఎగిరే పావురమా విజయంతో లైలా జాతకం మారింది. తెలుగులో ఉగాది, పెళ్లి చేసుకుందాం రా, ఖైదీ గారు, పవిత్ర ప్రేమ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కోలీవుడ్‌లో సూర్యతో కలిసి నటించిన సినిమాలు ఆమెకు గొప్ప గుర్తింపు తెచ్చాయి. సూర్యతో ఆమెకు ప్రేమాయణం నడిచిందనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఆమె ఐటమ్ సాంగ్స్, సహాయ పాత్రలకు పరిమితమయ్యారు. లైలా జీవితంలో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆమె నిరంతరం నవ్వుతూ ఉండేవారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఎంత పని చేశావ్ సామి..!! రెమ్యునరేషన్ కారణంగా ప్రభాస్ సినిమాకు నో చెప్పిన నటుడు..

శివపుత్రుడు చిత్రం షూటింగ్ సమయంలో విక్రమ్ ఈ విషయాన్ని గమనించి, ఒక నిమిషం నవ్వు ఆపుకోవాలని ఛాలెంజ్ చేశారు. కానీ లైలా 30 సెకన్లు కూడా నవ్వును ఆపుకోలేకపోయారట, నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తే ఆమె కళ్ళ నుండి నీళ్లు వచ్చేవట. వైద్యులు దీనిని ఒక రకమైన కండిషన్ అని నిర్ధారించారు. నవ్వు ఆమెకు ఒక వరం కాదు, ఒక శాపం అని అప్పుడు అర్థమైందట. ఇదొక వింత వ్యాధి.. ఆమె నవ్వును కంట్రోల్ చేసుకోలేదు. ప్రతి చిన్న విషయానికీ నవ్వేస్తుంది. సీరియస్ సిచువేషన్ లో కూడా ఆమె నవ్వేస్తుంది. కాగా ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరానియన్ వ్యాపారవేత్త మెహదీని 2006లో లైలా వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులతో కుటుంబ జీవితం సంతోషంగా గడుపుతున్నారు. కాగా లైలా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం లైలా వెబ్ సిరీస్‌లు, సినిమాలలో నటిస్తూ తన రెండవ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: ఆమెకు రోజుకు 50సార్లు ఐ లవ్ యూ చెప్పేవాడ్ని.. ఆ హీరోయిన్ కోపంతో వెళ్ళిపోయింది

View this post on Instagram

A post shared by Laila (@laila_laughs)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్