AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ధోనీ ఆడకపోవడానికి గాయం కారణం కాదా.. ‘మిస్టర్ కూల్’ గైర్హాజరీ వెనుక అసలు నిజం ఇదే..?

Why Dhoni is not playing: ఐపీఎల్ 2026 చెన్నై సూపర్ కింగ్స్ దూసుకెళ్తోంది. అయితే, ఇప్పటి వరకు ధోని మాత్రం ఆడడం లేదు. అభిమానులు మాత్రం మిస్టర్ కూల్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు గాయం కారణంగా ధోని ఆడడం లేదని అంతా అనుకున్నారు. కానీ అసలు రీజన్ వేరొకటి ఉందంట.

Venkata Chari
|

Updated on: Apr 26, 2026 | 7:15 AM

Share
Why Dhoni is Not Playing: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు తమ అభిమాన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీని మైదానంలో చూసే అవకాశం దక్కలేదు. ధోనీ గైర్హాజరుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ధోనీ ఆడకపోవడానికి కేవలం గాయం మాత్రమే కారణం కాదని తెలుస్తోంది.

1 / 5
సాధారణంగా ధోనీ అంటేనే జట్టు ప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తి. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తాజా నివేదిక ప్రకారం, ధోనీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. అయితే, జట్టులో ప్రస్తుతం నెలకొన్న సానుకూల వాతావరణాన్ని దెబ్బతీయకూడదని అతను భావిస్తున్నాడట. వరుసగా మూడు ఓటముల తర్వాత చెన్నై జట్టు పుంజుకుని, వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో గెలిచే జట్టు విన్నింగ్ కాంబినేషన్ మార్చడం ఇష్టం లేకనే ధోనీ మైదానంలోకి దిగడానికి వేచి చూస్తున్నట్లు సమాచారం.

2 / 5
మరోవైపు జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాటలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ధోనీ ఆరోగ్యంపై ఆయన స్పందిస్తూ.. "ధోనీ కోలుకుంటున్నాడు, అతను క్రమంగా మెరుగుపడుతున్నాడు. వైద్య బృందం సూచనల మేరకు అతను సాధన చేస్తున్నాడు" అని తెలిపాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ఫ్లెమింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ధోనీ ఇప్పటికే జట్టుతో కలిసి ప్రయాణిస్తున్నాడు, నెట్స్‌లో సాధన చేస్తూ కనిపిస్తున్నాడు. కానీ, తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోవడం లేదు.

3 / 5
ధోనీ లేని లోటును కొత్తగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ భర్తీ చేస్తున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు బ్యాటింగ్‌లోనూ సంజూ చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌పై కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులతో అజేయ సెంచరీ బాది చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు. సంజూ ఫామ్‌లో ఉండటం కూడా ధోనీ విశ్రాంతి తీసుకోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.

4 / 5
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్రారంభంలో తడబడినప్పటికీ, రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జట్టు మళ్ళీ గాడిలో పడింది. ముంబైని వారి సొంత గడ్డపైనే 103 పరుగుల తేడాతో ఓడించడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ధోనీ ఎప్పుడు తిరిగి వస్తాడా అని కోట్లాది మంది అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బహుశా ప్లే ఆఫ్ సమీపించే సమయానికి ధోనీ నేరుగా బరిలోకి దిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

5 / 5
Follow Us