AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : మరోసారి థియేటర్లలో రచ్చ చేయనున్న ‘గుడుంబా శంకర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సింహాద్రి సైతం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది.

Pawan Kalyan : మరోసారి థియేటర్లలో రచ్చ చేయనున్న 'గుడుంబా శంకర్'.. రీరిలీజ్ ఎప్పుడంటే..
Gudumba Shankar
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2023 | 10:54 AM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రీరిలీజ్ చిత్రాల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాలు మరోసారి అడియన్స్ ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సింహాద్రి సైతం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే.. బుధవారం దివంగత హీరో కృష్ణ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ కెరియర్‏లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ గుడుంబా శంకర్. ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాను పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత నాగబాబు నిర్మించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే ప్రతినాయకులుగా నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. వీరశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రీరిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన బ్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేయగా.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో నటిస్తుండగా.. ఇటీవలే డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయ్యింది.

Follow Us