AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు : జగపతిబాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు : జగపతిబాబు
Jagapathi Babu
Rajeev Rayala
|

Updated on: Jun 01, 2026 | 9:01 PM

Share

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా పీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సినీ ప్రముఖులు, సినిమా టీమ్ హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో జగపతి బాబు మాట్లాడుతూ..

విజయవాడోళ్లు మామూలోళ్లు కాదు విజయవంతంగా పెద్ది టీమ్ ను తీసుకురాగలి గారు.. రామ్ చరణ్ ను తీసుకురాగలిగారు. నేను పుట్టింది విజయవాడలోనే.. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగాను.. పెద్ది సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవుతుంది. వేరే రేంజ్ కు వెళ్తుంది. అందరి ఆకలి, దాహం తీర్చే సినిమా ఇది..

నాకు మంచి పాత్ర వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది.. అరవింద సమేత తర్వాత పెద్దిలో మంచి పాత్ర వచ్చింది. రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు. ప్రతి సీన్ సిక్స్ కొట్టాడు.. మెగాస్టార్ చిరంజీవి గారితో మాట్లాడుతూ.. చరణ్ ఎంత ఎదిగిపోయాడు అని నేను అంటే.. చరణ్ నటుడిగా కంటే ఒక మంచి మనిషిగా చాలా సక్సెస్ అయ్యాడు అని చిరంజీవి అన్నారు. అది నేను సినిమా సెట్ లో చూశా.. అని జగపతిబాబు అన్నారు. ఇక బుచ్చిబాబు చూడటానికి బఠాని అంత ఉన్నా అతనిలో చాలా టాలెంట్ ఉంది.. చాలా ప్రేమగా ఉంటాడు. తన ప్రతి పాత్ర డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. రెహమాన్ అద్బుతమైన సంగీతం అందించారు. వీళ్లందరితో కలిసిపని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. జాన్వీ కపూర్ సినిమాలో చాలా బాగా చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us