లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇక చందమామ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమా ఈ అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేసింది. దాంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ భామ. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫొటోస్ తో ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంది. ఇదే తరహాలో తాజా ఫొటోస్ తో మరోసారి సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.