Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గుడుంబా శంకర్ రీరిలీజ్.. ఎప్పుడో తెలుసా..?
డైరెక్టర్ వీరశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల నాగేంద్ర బాబు నిర్మించారు. 2004లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా కలెక్షన్స్ సునామి సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే బ్రో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవన్.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రానున్నారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా గుడుంబా శంకర్ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. డైరెక్టర్ వీరశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల నాగేంద్ర బాబు నిర్మించారు. 2004లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా కలెక్షన్స్ సునామి సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1వ తేదీన గుడుంబా శంకర్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. జల్సా, ఆరెంజ్ టికెట్స్ ద్వారా వచ్చిన కలెక్షన్లను జనసేన పార్టీకి ఫండ్ ఇచ్చినట్లుగా.. ఈ చిత్రం ద్వారా వచ్చిన టికెట్స్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ ను జనసేన పార్టీకి ఫండ్ కి అంకితం చేయబడుతుంది అని అన్నారు. అంతేకాకుండా అధికారిక పోస్టర్ వివరాలు కూడా తెలుపుతాము అని పేర్కొన్నారు నిర్మాత నాగబాబు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు ఓజీ.. ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మూవీస్ నుంచి విడుదలైన గ్లింప్స్ అంచనాలను మరింత పెంచేశాయి.
ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1న.. “గుడుంబా శంకర్”ని థియేటర్లలో తిరిగి విడుదల చేస్తున్నట్లు మేము సగర్వంగా ప్రకటిస్తున్నాము, “జల్సా” మరియు “ఆరెంజ్” టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎలాగైతే జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చామో, అలాగే ఈ చిత్రం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయిని…
— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.