BRO OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న పవన్‌ కల్యాణ్‌, తేజ్‌ల ‘బ్రో’.. ఆ స్పెషల్ డే రోజునే స్ట్రీమింగ్‌

భారీ అంచనాలతో జులై 28న విడుదలైన 'బ్రో' మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా పవన్‌ వింటేజ్‌ లుక్‌, స్టైల్‌, యాక్టింగ్‌, పవర్‌ స్టార్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాంగ్స్‌.. ఇలా అన్నీ పవన్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్‌ ఇచ్చాయి. ఇక సాయి ధరమ్‌ తేజ్‌ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

BRO OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న పవన్‌ కల్యాణ్‌, తేజ్‌ల 'బ్రో'.. ఆ స్పెషల్ డే రోజునే స్ట్రీమింగ్‌
Bro The Avatar Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2023 | 12:18 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌.. సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘బ్రో.. ది అవతార్‌’. తమిళంలో సూపర్‌ హిట్‌గా వినోదయ సీతమ్‌ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మెగా మల్టీ స్టారర్‌ మూవీలో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ కథానాయికలుగా నటించారు. సముద్రఖని దర్శకత్వం వహించగా, పీపుల్స్‌ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాలతో జులై 28న విడుదలైన ‘బ్రో’ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. మామా అల్లుళ్లు కలిసి నటించడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా పవన్‌ వింటేజ్‌ లుక్‌, స్టైల్‌, యాక్టింగ్‌, పవర్‌ స్టార్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాంగ్స్‌.. ఇలా అన్నీ పవన్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్‌ ఇచ్చాయి. ఇక సాయి ధరమ్‌ తేజ్‌ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే మూవీలోని ఎమోషనల్‌ కంటెంట్‌కు మెగా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే పవన్‌ కల్యాణ్‌ బ్రో మూవీ ఓటీటీ రిలీజ్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది

పవన్ పుట్టిన రోజు కానుకగా..

ఈ మెగా మల్టీ స్టారర్‌ మూవీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక స్ట్రీమింగ్‌ డేట్‌పై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు కానీ..థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతే ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని సెప్టెంబర్‌ 2 న బ్రో మూవీని ఓటీటీలోకి తీసుకువస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పవచ్చు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మూవీకి తమన్‌ స్వరాలు సమకూర్చారు. బ్రో తర్వాత పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!