AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie: బాక్సాఫీస్‌పై ‘ఓజీ’ దండయాత్ర.. నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లు ఇవే.. అధికారిక ప్రకటన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. (సెప్టెంబర్ 25)న విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు వీకెండ్ తో పాటు దసరా సెలవులు కలిసి వచ్చాయి. దీంతో పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

OG Movie: బాక్సాఫీస్‌పై 'ఓజీ' దండయాత్ర.. నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లు ఇవే.. అధికారిక ప్రకటన
Pawan Kalyan OG Movie Collections
Basha Shek
|

Updated on: Sep 29, 2025 | 3:44 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. హీరోయిన్ కూడా ఎంతో అందంగా కనిపించింది. ఇక థమన్ బీజీఎం సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీంతో పవన్ అభిమానులతో పాటు సామాన్య జనాలు కూడా ఓజీ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కలెక్షన్ల పరంగా చూస్తే.. మొదటి రోజే 154 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది ఓజీ. ఇక తాజాగా మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఓజీ సినిమా నాలుగు రోజుల్లో 252 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు మూవీకి సంబంధించి ఒక సూపర్బ్ పోస్టర్ ను విడుదల చేసింది.

పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఓజీ మూవీ ఓవర్సీస్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. అమెరికాలో ఇప్పటికే 5 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపు 40 కోట్ల కలెక్షన్స్ కేవలం అమెరికా నుంచే వచ్చాయన్నమాట. ఇక పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఓజీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్‌, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్,  వెంకట్, కిక్ శ్యామ్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.

ఇవి కూడా చదవండి

డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
మోమోస్, నూడుల్స్ ప్రసాదంగా ఇచ్చే కాళీ ఆలయం.. ఈ దేవాలయం విశేషాలు..
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?
రేవంత్‌ అండ్ కిషన్‌..! సింగిల్ ఫ్రేమ్‌... డబుల్ ఎజెండా?