దసరా ఆఫర్.. మరింత తగ్గిన ‘మిరాయ్’ టికెట్ ధర
హైదరాబాద్: తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఫాంటసీ ఫిల్మ్ ‘మిరాయ్’. సెప్టెంబరు 12న పాన్ ఇండియాగా విడుదలైన మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకూ రూ.140 కోట్లకు పైగా వసూలు చేసింది. మరింత మంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేసేందుకు చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలను తగ్గించింది. బాల్కనీ టికెట్ ధరను రూ.150, ఫస్ట్ క్లాస్‌ను రూ.105గా నిర్ణయించింది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజా నిర్ణయంతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా విడుదల సమయంలోనూ సాధారణ టికెట్ ధరలనే అమలు చేస్తేనే రూ.140 కోట్లు వసూలు కాగా, ఇప్పుడు తగ్గించిన ధరలతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే అవకాశం ఉంది. పండుగ వేళ థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించడానికి ‘వైబ్’ సాంగ్‌ను జత చేస్తుంది. ‘‘చాట్‌బాస్టర్ ‘వైబ్’ సాంగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ‘మిరాయ్’ ప్రదర్శితమవుతున్న అన్ని షోలలోనూ యాడ్ చేస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. గౌర హరి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ 19 రోజులు
ఈ ఆటో రిక్షా కుర్రాడి సంపాదన నెలకు రూ.లక్ష
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిదాయక నిర్ణయం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

