Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురువు ఎవరో తెలుసా ?.. కానీ ఇప్పటికీ వారి మధ్య ఓ గొడవ ఉందట..

పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్‌పై ఈయనో పవర్‌ స్టార్.. సూపర్ డూపర్‌ హిట్లకు.. విపరీతమైన క్రేజ్‌కు కేరాఫే ఈ స్టార్.. అదే ఆఫ్‌స్క్రీన్‌పై... ఈయనో ఇంట్రోవర్ట్! ఏదో సాధించాలని.. చేయాలని తపించే ఎంతూజియాస్టిక్.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురువు ఎవరో తెలుసా ?.. కానీ ఇప్పటికీ వారి మధ్య ఓ గొడవ ఉందట..
Pawan Kalyan
Follow us

|

Updated on: Feb 04, 2023 | 3:57 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 కు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాకతో ఒక్కసారిగా ప్రేక్షకులు చూపు తనవైపు తిప్పుకుంది ఈ షో. ఇక ఆ వెంటనే పవర్ స్టార్ రాక. అన్ స్టాపబుల్.. పవన్ ఎపిసోడ్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోస్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. అయితే ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు పవర్ స్టార్. సినిమాల గురించి మాత్రమే కాదు.. వ్యక్తిగత విషయాలు…ఫ్యామిలీ గురించి కూడా పలు విషయాలను బయటపెట్టారు. అలాగే తనపై వస్తున్న పుకార్ల గురించి కూడా పవన్ ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా తన గురువు గురించి కూడా బయటపెట్టారు.

పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్‌పై ఈయనో పవర్‌ స్టార్.. సూపర్ డూపర్‌ హిట్లకు.. విపరీతమైన క్రేజ్‌కు కేరాఫే ఈ స్టార్.. అదే ఆఫ్‌స్క్రీన్‌పై… ఈయనో ఇంట్రోవర్ట్! ఏదో సాధించాలని.. చేయాలని తపించే ఎంతూజియాస్టిక్. ఏనీ ఫీల్డ్ ఈయనో ప్రొటగోనిస్ట్! ఎన్‌సైక్లోపీడియాకు synonym. అలాంటి ఈ స్టార్ కు గురూజీ ఉంటారా…? అసలు అవసం అంటారా…? సినిమాల్లోనూ.. అటు రాజకీయాల్లో దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. ఎట్ ప్రజెంట్ ఆహా అన్‌స్టాపబుల్ 2 షోతో విపరీతంగా బజ్‌ చేస్తున్నారు. బాలయ్య బాబుతో సరదాగా ముచ్చటిస్తూ.. నెట్టింట ట్రెండ్‌ అవుతున్నారు. తన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను.. ఈ షో వేదికగానే పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనకు డైరెక్టర్ త్రివిక్రమ్‌కు మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. తివిక్రమ్‌ తనకు గురు సమానులని.., కాదు కాదు.. గురూజీనే అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

తాను తివిక్రమ్‌ తరుచుగా కలుస్తామని.. తమ మధ్య మాత్రం సినిమా టాపిక్స్ ఏం రావన్నారు. త్రివిక్రమ్‌తో పురాణాలు ఇతిహాసాల గురించి.. సైన్స్‌ అండ్ టెక్నాలజీ గురించి.. కవితలు.. కథల గురించే మాట్లాడతా అన్నారు. అంతేకాదు.. తివిక్రమ్‌ ఎన్‌సైక్లోపీడియా అని.. ఆయనకు తెలియనివి దాదాపు లేవంటూనే.. తనకు త్రివిక్రమ్ గురూజీ లాంటివారని అన్నారు. ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. అలాగే మా ఇద్దరి మధ్య ఇప్పటికీ ఓ గొడవ నడుస్తుంటుంది అన్నారు. అతను అతడు సినిమా కథ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేను నిద్రపోయాను అంటాడు. నేనేమో కాదు అంటాను. ఈ గొడవ ఇప్పటికీ మా మధ్య గొడవ కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో