Pawan Kalyan: కార్తీ ట్వీట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే

తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై మండిపడ్డారు అపచారం జరిగిందని మేము బాధపడుతుంటే కొందరు ఈ వివాదం పై ఫన్నీగా మాట్లాడటం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అలాగే సినీ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్ లో లడ్డు గురించి యాంకర్ చేసిన కామెంట్స్ పై కార్తీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.

Pawan Kalyan: కార్తీ ట్వీట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2024 | 8:57 PM

లడ్డు వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై మండిపడ్డారు అపచారం జరిగిందని మేము బాధపడుతుంటే కొందరు ఈ వివాదం పై ఫన్నీగా మాట్లాడటం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అలాగే సినీ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న సత్యం సుందరం అనే సినిమా ఈవెంట్ లో లడ్డు గురించి యాంకర్ చేసిన కామెంట్స్ పై కార్తీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. లడ్డు అనేది ఇప్పుడు సెన్సిటివ్ విషయం.. దాని గురించి మనం మాట్లాడకూడదు అని అన్నారు. దీని పై పవన్ సీరియస్ అయ్యారు. లడ్డు వ్యవహారం చాలా పెద్దది దయచేసి దీని గురించి ఫన్నీ కామెంట్స్ చెయ్యొద్దు అని పవన్ అన్నారు.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

దానికి కార్తీ ట్వీట్ చేసి క్షమాపణలు కూడా తెలిపాడు. తాను ఎలాంటి దురుద్దేశంతో అనలేదు అని.. తన వ్యాఖ్యలను తప్పుగా తీసుకున్నారు అని క్లారిటీ ఇచ్చాడు కార్తీ.  తాజాగా కార్తీ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. డియర్ కార్తీ గారు, మన సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని అలాగే మీ దయను, వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తిరుపతి అలాగే దాని గౌరవప్రదమైన లడ్డూల వంటి మన పవిత్ర సంస్థలకు సంబంధించిన విషయాలు లక్షలాది మంది భక్తుల కోసం లోతైన భావోద్వేగ భారాన్ని కలిగి ఉంటాయి. అలాంటి విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం మనందరికీ చాలా అవసరం. దీని వెనుక ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అలాగే పరిస్థితి అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను. ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ఐక్యత, గౌరవాన్ని పెంపొందించడం, ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి, మన సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల గురించి. సినిమా ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం. అంకితభావం,  ప్రతిభ ఉన్న ఒక అద్భుతమైన నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను. అలాగే సూర్య , జ్యోతిక నిర్మిస్తున్న కార్తీ కొత్త చిత్రం సత్యంసుందరం విజయం సాదించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు పవన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!