Harsha sai: అంతా ఓకే కానీ అమ్మాయి విషయంలో దొరికిపోయాడు..

తాను సంపాదించిన సొమ్ములో.. కొంత పేదలకు పంచి పెడుతూ పాపులారిటీ పొందిన హర్షసాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్స్‌ను హర్షసాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు గత కొంతకాలం విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెళ్లిపేరుతో హర్షసాయి మోసం చేశాడని

Harsha sai: అంతా ఓకే కానీ అమ్మాయి విషయంలో దొరికిపోయాడు..
Harsha Sai
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 24, 2024 | 8:46 PM

యూట్యూబ్‌ చూసే ప్రతి ఒక్కరూ ఏదో సమయం హర్షసాయి వీడియోలు చూసే ఉంటారు. మొదట్లో యూట్యూబర్‌గా కెరియర్‌ బిగెన్ చేసిన హర్షసాయి..ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్‌గా మారాడు. వెరైటీ కాన్సెప్ట్‌లు, క్రియేటివ్ థాట్స్‌తో రీల్స్‌, వీడియోలు, షార్ట్ వీడియోలు చేసి బాగా పాపులర్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో హర్షసాయికి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. త్వరలో వెండితెరపై కూడా అడుగుపెట్టబోతున్నాడు..హర్షసాయి. మెగా పేరుతో ఓ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో లీడ్‌ రోల్‌లో హర్షసాయి నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను కూడా లాంచ్‌ చేశారు.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

తాను సంపాదించిన సొమ్ములో.. కొంత పేదలకు పంచి పెడుతూ పాపులారిటీ పొందిన హర్షసాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్స్‌ను హర్షసాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్లు గత కొంతకాలం విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెళ్లిపేరుతో హర్షసాయి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో..మరోసారి వార్తల్లోకి ఎక్కాడు హర్షసాయి. అయితే ఈ వ్యవహారంపై ఇంకా స్పందించ లేదు హర్షసాయి.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని సదరు యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటున్న తనను మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా ఆ యువతి ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. హర్షసాయి పై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా అడ్వొకేట్‌ సహా నార్సింగి పీఎస్‌కు వచ్చింది ఆ యువతి. పెళ్లి చేసుకుంటానని రూ.2కోట్లు తీసుకున్నాడని ఆమె ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే ఆ యువతి కూడా పాపులర్ పర్సన్ అని తెలుస్తోంది. బిగ్ బాస్ లోనూ ఆమె పాల్గొందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

View this post on Instagram

A post shared by Harsha sai (@harshasai_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.