Pawan Kalyan: అల్లుడితో కలిసి మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పవన్.. ఇక అభిమానులకు పండగే..

ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ షూరు చేశారు పవన్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

Pawan Kalyan: అల్లుడితో కలిసి మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన పవన్.. ఇక అభిమానులకు పండగే..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 22, 2023 | 11:29 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో.. ఇటు వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలోనూ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ షూరు చేశారు పవన్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

డైరెక్టర్ కమ్ నటుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాను తెలుగు రీమేక్ చేస్తున్నారు సముద్రఖని. ఇందులో పవన్ తోపాటు… హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు.

ఇవి కూడా చదవండి

బుధవారం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్.. పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ ఒరిజినల్ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేయడంతోపాటు.. డైలాగ్ వెర్షన్ రాసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇందులో సాయికు జోడిగా.. కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం పవన్ 20 రోజులు కేటాయించినట్లుగా సమాచారం.అలాగే మరోసారి ఇందులో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!