Tollywood: శ్రీకాంత్, ఊహల గారాలపట్టి మేధా ఇప్పుడెలా ఉందో చూశారా..? కుందనపు బొమ్మే..
ఇప్పుడు కుందనపు బొమ్మలా ఎంతో అందంగా ఉంది మేధా. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు అభిమానులు.
సీనియర్ నటుడు శ్రీకాంత్, ఒకప్పటి నటి ఊహల గారాలపట్టి మేధా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. 2016లో అక్కినేని నాగార్జున నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమాతో శ్రీకాంత్ తనయుడు రోషన్ తన లుక్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రోషన్ తన రెండవ సినిమా ‘పెళ్లి సందడి’తో మరింత మెరుగయ్యాడు. మంచి హిట్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. మేధా కూడా చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుంది. నార్మల్‌గా చూస్తే.. ఈమె హీరోయిన్ అనే అనుకుంటారు. మేధా చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది. శ్రీకాంత్, ఊహ.. ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఉత్సాహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సరైన స్క్రిప్ట్ దొరికితే ఆమెను ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ప్రజంట్ ప్లస్ టూ కంప్లీట్ చేసిన మేధా.. డిగ్రీలో జాయిన్ అయ్యింది. ప్రజంట్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్ ఉందని.. త్వరలో సినిమాల్లో అడుగుపెట్టే అంశం గురించి ఆలోచిస్తానని తనే టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక మేధాకు బాస్కెట్ బాల్ ఆడటం చాలా ఇష్టం. తన అన్న రోషన్, తాను చిన్నప్పుడు నుంచి తెగ కొట్టుకునేవాళ్లమని.. ఇప్పుడు మానేసినట్లు ఆమె తెలిపింది. శ్రీకాంత్, ఊహలు వాళ్ళ పిల్లలకు..చదువుతో పాటు..మంచి సంస్కారం..వినయం..పద్దతిని నేర్పించారు. చాలా మంది సినిమా వాళ్ళు తమ పిల్లలు మాతృభాషలో మాట్లాడితే ..సిగ్గుగా ఫీల్ అవుతారు. కానీ శ్రీకాంత్ ఊహ గారి పిల్లలు రత్నాలు.. చాలా స్పష్టమైన తెలుగులో మాట్లాడతారు. పెద్దలు అంటే గౌరవం ఇస్తారు. కించెత్ గర్వం కూడా ఉంటారు. అలాంటి వాళ్లు వృద్ధిలోకి రావాలని మనం కూడా కోరుకుందాం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.