Tollywood: గాలికి సైతం ఊపిరాడనివ్వని ముద్దుగుమ్మ.. అమాయకంగా కనిపించే అందాల రాక్షసి.. ఎవరో గుర్తుపట్టండి..
ఫస్ట్ మూవీతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. అమాయకంగా కనిపిస్తూనే.. గ్లామర్ షోతో మైమరపించింది. తొలి సినిమా సూపర్ డూపర్ హిట్.. కానీ ఆ తర్వాత అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఎవరో గుర్తుపట్టండి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న అందాల తారలు ఇప్పుడు అగ్రకథానాయికలుగా కొనసాగుతున్నారు. మరికొందరు మాత్రం టాలెంట్ ఉన్నా.. రెండు మూడు చిత్రాలతోనే సరిపెట్టుకున్నారు. అలాంటి వారి జాబితాలో ముంటుందుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. అమాయకంగా కనిపిస్తూనే.. గ్లామర్ షోతో మైమరపించింది. తొలి సినిమా సూపర్ డూపర్ హిట్.. కానీ ఆ తర్వాత అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఎవరో గుర్తుపట్టండి.
పైన ఫోటో చూస్తుంటే తెలిసిపోతుంది కదా.. ఆ అందాల రాక్షసి ఎవరో. తనే అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే. డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడిగా ఈ ముద్దుగుమ్మ నటించిన తీరుకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మహానటి చిత్రంలో కీర్తి సురేష్ స్నేహితురాలి పాత్రలో ఒదిగిపోయింది. అయితే వెంట వెంటనే ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత అవకాశాలు రాలేదు.
దీంతో తనవరకు వచ్చిన ప్రాజెక్ట్స్ చేసినా.. అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. తెలుగులో చివరిసారిగా ఇద్దరి లోకం ఒకటే సినిమాలో కనిపించింది. వెండితెరకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.