Ala Modalaindi: రీరిలీజ్‌కు రెడీ అయిన అలా మొదలైంది.. నాని అభిమానులకు ఇక పండగే..
ఇప్పుడు మరో సూపర్ హిట్ ఫిల్మ్ అలా మొదలైంది కూడా థియేటర్లలోకి రాబోతుంది. న్యాచురల్ స్టార్ నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని.. నిత్యా కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
కొద్ది రోజులుగా తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు.. ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒక్కడు, జల్సా, ఖుషి, పోకిరి, బాద్ షా, గ్యాంగ్ లీడర్, వర్షం సినిమాలున్నాయి. ఇటీవల ఈ సినిమాలు 4కె వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు మరో సూపర్ హిట్ ఫిల్మ్ అలా మొదలైంది కూడా థియేటర్లలోకి రాబోతుంది. న్యాచురల్ స్టార్ నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని.. నిత్యా కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 24నల ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయబోతున్నారట. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికీ మూవీ లవర్స్ కు ఆల్ టైమ్ ఫేవరెట్.
సినిమానే కాదు.. ఇందులోని సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతె తెలుగు తెరకు పరిచయమైన నిత్యా.. గాయనిగానూ మెప్పించింది. ఈ సినిమాకు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించాగా.. రెండు నంది అవార్డులు గెలుచుకుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.