Taraka Ratna: తారకరత్నతో ‘భద్రాద్రి రాముడు’ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా ?.. ఆమె ఓ మాజీ సీఎం భార్య..
తారకరత్నతో స్క్రీన్ షేర్ చేసుకుని బ్లాక్ బస్టర్ల హిట్స్ తమ ఖాతాలో వేసుకుని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయైన కథానాయకలు గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్స్. తారకరత్న నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో భద్రాద్రి రాముడు ఒకటి.

నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచివెళ్లారు అనే నిజాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి మృత్యుంజయుడు అయి తిరిగి వస్తాడనుకున్న తమ అభిమాన హీరో.. తిరిగి లోకాలకు పయనమయ్యారు. దీంతో తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు గుర్తుచేసుకుంటుండగా.. ఫ్యాన్స్ తమ హీరో చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈరోజు (ఫిబ్రవరి 22) తారకరత్న పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్లో సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తారకరత్నతో స్క్రీన్ షేర్ చేసుకుని బ్లాక్ బస్టర్ల హిట్స్ తమ ఖాతాలో వేసుకుని అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయైన కథానాయకలు గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్స్. తారకరత్న నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో భద్రాద్రి రాముడు ఒకటి.
డైరెక్టర్ సురేష్ క్రిష్ణ దర్శకత్వంలో నందమూరి తారకరత్న ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భద్రాద్రి రాముడు. 2004 జూన్ 25న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో తారకరత్న సరసన రాధిక కుమారస్వామి కథానాయికగా నటించింది. ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించిన రాధిక అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో ఆమె తిరిగి కన్నడ సినీ పరిశ్రమలో వరుస చిత్రాలతో బిజీగా అయ్యింది.




రాధిక.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య. గతంలో వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి వార్తలు రాగా.. కొద్దిరోజులకు వీరు వివాహం చేసుకున్నారు. కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక. ప్రస్తుతం కన్నడ చిత్రపరిశ్రమలో నటిగా.. నిర్మాతగా కొనసాగుతుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



