Suriya: బడ్జెట్‏లో జక్కన్నను మించిపోతున్న ఆ స్టార్ డైరెక్టర్.. హీరో సూర్యతో దాదాపు రూ. వెయ్యి కోట్ల సినిమా ?..

ఇప్పటివరకు వైవిధ్యభరితమైన సినిమాలను ఎంచుకుంటూ అభిమానులను సొంతం చేసుకున్న తమిళ్ స్టార్ సూర్యతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందామా.

Suriya: బడ్జెట్‏లో జక్కన్నను మించిపోతున్న ఆ స్టార్ డైరెక్టర్.. హీరో సూర్యతో దాదాపు రూ. వెయ్యి కోట్ల సినిమా ?..
Suriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 11, 2022 | 12:32 PM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల హావా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు డైరెక్టర్ రాజమౌళి. కంటెంట్ పరంగానే కాదు..బడ్జెట్ విషయంలోనూ ఔరా అనిపించాడు. ఇక ఇటీవల తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టాడు. రూ. 400 కోట్లతో ట్రిపుల్ ఆర్ తెరకెక్కించి.. ప్రపంచవ్యా్ప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఇక జక్కన్న దారిలోనే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం ఎన్నో అంచనాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కేజీఎఫ్ నిర్మించి రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అనంతరం పుష్ప, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగా..ఇప్పుడు చిన్న సినిమాగా వచ్చిన కాంతార కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూ సక్సెస్‏ఫుల్‏గా దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా రూ. 1000 కోట్లతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసుకువచ్చేందుకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కసరత్తులు చేస్తున్నారు. అది కూడా ఇప్పటివరకు వైవిధ్యభరితమైన సినిమాలను ఎంచుకుంటూ అభిమానులను సొంతం చేసుకున్న తమిళ్ స్టార్ సూర్యతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకుందామా.

కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్..ఇప్పుడు తమిళ్ స్టార్ సూర్యతో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం కమల్ ప్రధాన పాత్రలో ఇండియన్ 2.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రెండు మెగా ప్రాజెక్ట్స్ చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలతో బిజీగా ఉన్న శంకర్.. తర్వాత చారిత్రక కథా చిత్రాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

వేల్పారి అనే చారిత్రక కథా చిత్రాన్ని దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కించడానికి శంకర్ సిద్ధమవుతున్నట్లుగా టాక్. మధురై పార్లమెంట్ సభ్యుడు ఎ స్. వెంకటేశన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారని ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది . చోళ, చేర, పాండియన్ రాజుల తర్వాత తరం రాజైన నేర్పాలి రాజు ఇతివృత్తమే శంకర్ దర్శకత్వం వహించనున్నారని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందండోయ్..!
తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందండోయ్..!
టాలీవుడ్ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ రచయిత చిన్ని కృష్ణ ఇంట తీవ్ర విషాదం
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..
ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..