P. V. Sindhu: ఆ స్టార్ హీరో అంటే ఇష్టమంటున్న పీవీ సింధు.. అంతే కాదండోయ్..

పీవీ సింధు.. గురించి తెలియాలని తెలుగువారు ఉండరేమో.. బ్యాట్మెంటన్ స్టార్ గా సింధు సాధించిన విజయాలను అన్ని ఇన్ని కావు. ఇటీవల కామన్‌వెల్త్‌ 2022 గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

P. V. Sindhu: ఆ స్టార్ హీరో అంటే ఇష్టమంటున్న పీవీ సింధు.. అంతే కాదండోయ్..
Pv Sindhu
Follow us

|

Updated on: Aug 20, 2022 | 5:04 PM

పీవీ సింధు(P. V. Sindhu).. గురించి తెలియాలని తెలుగువారు ఉండరేమో.. బ్యాట్మెంటన్ స్టార్ గా సింధు సాధించిన విజయాలను అన్ని ఇన్ని కావు. ఇటీవల కామన్‌వెల్త్‌ 2022 గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. సింధు తెలుగమ్మాయి కావడం మన తెలుగువారికి గర్వకారణం. తాజాగా పీవీ సింధు ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సింధు మాట్లాడుతూ విదేశాల్లో మన జాతీయ గీతం వింటున్నప్పుడు కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి అని అన్నారు సింధు. అక్కడ మన జాతీయ జండాను చూసినప్పుడు. మన జాతీయగీతం విన్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు పీవీ సింధు. అలాగే తెలుగులో తన ఫెవరెట్ హీరో గురించి చెప్పింది.

ఈ బ్యాట్మెంటన్ స్టార్ కు తెలుగులో ప్రభాస్ అంటే చాలా ఇష్టమట. ఆయనన్నా.. ఆయన సినిమాలన్నా చాలా ఇష్టం అని అంటుంది సింధు. అలాగే మేమిద్దరం మంచి స్నేహితులం అని తెలిపింది సింధు. అలాగే తనకు వచ్చిన ప్రేమ లేఖల గురించి మాట్లాడింది. తనకు చాలా ప్రేమ లేఖలు వచ్చేవని వాటిని తమ ఇంట్లో వాళ్ళందరం కలిసి చదివే వాళ్ళం అని తెలిపింది. వాటిలో ఒక 70 ఏళ్ల వయసున్న వ్యక్తి తనను పెళ్లి చేసుకోకపోతే కిడ్నప్ చేస్తాని కూడారాశాడట.. అలాగే మీరు సినిమాల్లో న‌టిస్తారా? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఏమో న‌టిస్తానేమో అని సింధు బ‌దులిచ్చింది. ఇదంతా చూస్తుంటే తన బయోపిక్ లో సింధు నే నటించే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ బ్యాట్మెంటన్ స్టార్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి