18 Pages Movie Collections: మనసులను దోచుకుంటున్న నిఖిల్, అనుపమల అందమైన ప్రేమకథ.. వారం రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ అంటే..

హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం 18 పేజిస్. డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే నే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది.

18 Pages Movie Collections: మనసులను దోచుకుంటున్న నిఖిల్, అనుపమల అందమైన ప్రేమకథ.. వారం రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ అంటే..
18 Pages Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2022 | 8:44 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్ అనుపమ ఇటీవలే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈమూవీ తర్వాత వీరు కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం 18 పేజిస్. డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే నే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకుంది. మౌత్ టాక్ తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతుంది. ఇక ఈ సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ థియేటర్లలో జోరు కొనసాగుతుంది.

నిఖిల్, అనుపమల అందమైన ప్రేమకథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. దీంతో థియేటర్లకు జనాల తాకిడి పెరిగింది. ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వారం రోజులకు రూ. 20 కోట్ల గ్రాస్ సాధించింది 18 పేజిస్ సినిమా. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు కుమారి 21 ఎఫ్ డైరెక్టర్ సూర్యప్రతాప్ దర్శకత్వం వహించగా.. సుకుమార్ కథ అందించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించారు.

కేవలం కమర్షియల్ మాత్రమే కాదు.. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరికి కూడా సరైన ఆదరణ లభిస్తుందని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. ఇక 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుందని గతంలోనే చెప్పుకొచ్చారు నిఖిల్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.