Kiara Advani: ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న ఆ స్టార్ హీరోయిన్.. మ్యారెజ్ డేట్.. టైం ఫిక్స్.. ఎక్కడంటే..

హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా.. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. వీరిద్దరు కలిసి ముంబై వీధుల్లో అనేకసార్లు కెమెరా కంటికి చిక్కారు.

Kiara Advani: ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న ఆ స్టార్ హీరోయిన్.. మ్యారెజ్ డేట్.. టైం ఫిక్స్.. ఎక్కడంటే..
Kiara Advani
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2022 | 9:27 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ చిత్రంలోనూ కనిపించింది. కావాల్సినంత అందం, టాలెంట్ ఉన్నా.. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి బీటౌన్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా.. యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. వీరిద్దరు కలిసి ముంబై వీధుల్లో అనేకసార్లు కెమెరా కంటికి చిక్కారు. సిద్ధార్థ్ ఇంటికి కియారా వెళ్లడం..పార్టీస్ అంటూ కలుసుకోవడంతో వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సిద్ధూ తన ప్రేమ, పెళ్లి గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి వీరి ప్రేమాయణం తెరపైకి వచ్చింది. త్వరలోనే వీరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారట.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జైసల్మేర్ లో వీరి వివాహం జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత ఢిల్లీలో వీరిద్దరి రిసెప్షన్ జరగనుందని.. కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్యే వీరి పెళ్లి జరగనుంది. అయితే దీని గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కరణ్ జోహార్, వరుణ్ ధావన్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖులు మాత్రమే కియారా, సిద్ధూ పెళ్లిలో సందడి చేయనున్నారు.

ఇటీవల కియారా, సిద్ధార్థ్ తమ న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ కోసం విదేశాలకు వెళుతూ.. ముంబై విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం కియారా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఆర్సీ 15 చిత్రంలో కనిపించనుంది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి సైతం నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ