18 Pages: పొయిటిక్ లవ్ స్టోరీగా వచ్చిన 18 పేజస్ ఎనిమిది రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
కుర్ర హీరో నిఖిల్ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది కార్తికేయ 2 తో పాటు 18 పేజెస్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా 18 పేజిస్ సినిమాను నిర్మించారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తోంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. మొదటి వారం పర్వాలేదు అనిపించిన ఈ మూవీ 8 వ రోజు కూడా ఓకే అనిపించింది.
నైజాం 3.54 కోట్లు, సీడెడ్ 0.65 కోట్లు, ఉత్తరాంధ్ర 0.73కోట్లు, ఈస్ట్ 0.48 కోట్లు, వెస్ట్ 0.26 కోట్లు, గుంటూరు 0.32 కోట్లు, కృష్ణా 0.26కోట్లు,నెల్లూరు 0.18 కోట్లు, ఏపీ , తెలంగాణ కలిపి 6.42 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.64 కోట్లు, ఓవర్సీస్ 1.26 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 8.32 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.
ఇక ఇటీవల హీరో నిఖిల్ మాట్లాడుతూ.. సినిమా రిలీజై వారం రోజులు అవుతుంది.. నేను న్యూస్ పేపర్స్ బుక్ మై షో చూస్తుంటే మొదటిరోజు ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అంతకుమించిన థియేటర్స్ ఉన్నాయ్ కొన్ని చోట్ల, ఇది ఒక బిగ్ అచివ్మెంట్. 18 పేజెస్ సినిమా ఒక స్లో పాయిజన్ అండి. 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది. ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అనుకున్నాను, కానీ నిజంగా ఈరోజు సర్ ప్రైజ్ అవుతున్నాను అని అన్నారు.