AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: ప్రతి క్యారెక్టర్ ను ఆచితూచి ఎంపిక చేశాం.. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ గురించి నిహారిక..

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి చూడాలని అనుకున్నా ప్రజలు ఓటీటీ వైపే చూస్తున్నారు.

Niharika Konidela: ప్రతి క్యారెక్టర్ ను ఆచితూచి ఎంపిక చేశాం.. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' గురించి నిహారిక..
Niharika
Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 13, 2021 | 6:46 AM

Share

Oka Chinna Family Story: వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు… ఏవి చూడాలని అనుకున్నా ప్రజలు ఓటీటీ వైపే చూస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీలు. ఇక జీ 5 ఓటీటీ సంస్థలో ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ను విడుదల చేసింది. తాజాగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS) ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా… సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను ప్రధాన, ప్రమీల రాణి (భామ) పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS). పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఆయనతో కలిసి మానసా శర్మ కథ, మాటలు అందించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19న ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్, వెబ్ సిరీస్ లో ‘అరే మహేషా…’ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. “ఆరేళ్ల క్రితం ‘ముద్దపప్పు ఆవకాయ్’తో పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను… నా ఫ్రెండ్ తో కలిసి! తర్వాత పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ లో మా నాన్నగారితో కలిసి ‘నాన్నకూచి’ అని ఇంకో వెబ్ సిరీస్ చేశా అన్నారు. ఆ రెండు ప్రాజెక్ట్స్ ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నా ప్రొడక్షన్ హౌస్ వరకూ ‘జీ 5’ ఇల్లు లాంటిది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’… ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఈ మూడు ప్రాజెక్ట్స్ నాకు చాలా స్పెషల్. నాకు బాగా నచ్చి ముందునుంచి వీటితో ట్రావెల్ అయ్యాను తెలిపారు నిహారిక. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ గురించి చెప్పాలంటే… నాకు మహేష్ గారు, మానస ముందు చెప్పినప్పుడు… ‘మహేష్ గారు! ఇది మీ కథేనా? మీకు లోన్స్ ఉన్నాయా?’ అని అడిగేశాను. ‘లేవు. నేను చూసిన సంఘటనల నుంచి రాసిన కథ’ అన్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దర్శకుడు మహేష్, ఆయనతో పాటు కథ రాసిన మానస నిద్ర లేకుండా రేయింబవళ్లు కష్టపడ్డారు. నటుడిగా, వ్యక్తిగా సంగీత్ శోభన్ ను ఇష్టపడనివారు ఉండరు. అతను చాలా టాలెంటెడ్. సూపర్బ్ ఎంటర్టైనర్. తనను స్క్రీన్ మీద చూడటం నాకు ఇష్టం అని చెప్పుకొచ్చింది.

కీర్తీ పాత్రకు ఎవరు సూటవుతారని చాలా చాలా వెతికాం. ఫైనల్లీ… సిమ్రాన్ శర్మ దొరికింది. తాను చాలా హార్డ్ వర్కర్. నరేష్ గారు వెబ్ సిరీస్ లో ఇప్పటివరకూ చేయలేదు. నా కోసం ఒప్పుకొన్నారు. మా చిన్న ఫ్యామిలీ ఆయన చాలా పెద్ద పార్ట్ ప్లే చేశారు. అలాగే, తులసిగారు. వాళ్లిద్దరితో నేను ఒక సినిమాలో యాక్ట్ చేశా అని అన్నారు. ఆ చనువుతో అడిగా. తులసిగారు కథ వినకముందే ‘నీ కోసం చేస్తా’ అని చెప్పారు. ప్రమీల గారి లాంటి అమ్మమ్మను అందరూ చూసి ఉంటారు. రాజీవ్ కనకాలగారు, వీర శంకర్ గారు, ‘టెంపర్’ వంశీగారు మా ప్రాజెక్టులో పార్ట్ అయినందుకు థాంక్స్. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఆచితూచి ఎంపిక చేశాం.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..