Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Manchu Vishnu: గత నెలలో జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ఎన్నికలు ఎంత గందరగోళానికి దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ మొత్తం ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు వర్గాలుగా మారిందా అన్నంతలా..

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..
Manchu Vishnu
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 12, 2021 | 8:59 PM

Manchu Vishnu: గత నెలలో జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ ఎన్నికలు ఎంత గందరగోళానికి దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ మొత్తం ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు వర్గాలుగా మారిందా అన్నంతలా రచ్చ జరిగింది. హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో చివరికి మంచు విష్ణు విజయం సాధించి మా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఇక ఆ తర్వాత కూడా కొన్ని నాటకీయ పరిణామాలతో మా ఎన్నికల అంశం నానుతూనే వచ్చింది. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి విపరీతంగా కష్టపడ్డ విష్ణు వ్యక్తిగత జీవితాన్ని కూడా కాస్త కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నిత్యం చేసే జిమ్‌ను కూడా పక్కనపెట్టాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం కాస్త ఫ్రీ అయ్యేసరికి మళ్లీ జిమ్‌ బాట పట్టారు విష్ణు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయనే స్వయంగా తెలిపారు.

జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న సమయంలో దిగిన ఫోటోను పోస్ట్‌ చేసిన విష్ణు.. ‘జిమ్‌లో వర్కవుట్స్‌ మళ్లీ మొదలు పెట్టాను. గత రెండు నెలలుగా నా డైటింగ్‌, వర్కవుట్స్‌ పూర్తిగా దారితప్పాయి. ఈ జర్నీని డాక్యుమెంట్‌గా తీయాలనుకుంటున్నాను. గతంలోలాగే మళ్లీ నా శరీరాకృతిని మార్చుకుంటాను’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు విష్ణు. మా ఎన్నికల్లో పడి ఆరోగ్యాన్ని విస్మరించిన విష్ణు ఇప్పుడు.. దానిని బ్యాలెన్స్‌ చేసే పనిలో పడ్డాడన్నమాట.

విష్ణు చేసిన పోస్ట్..

Also Read: Sajjala: ‘ఏపీ ఎలా పోతుందో మీకెందుకు ?’.. తెలంగాణ మంత్రి కామెంట్స్‌కు సజ్జల కౌంటర్

35 తర్వాత చర్మం ముడతలు పడుతుందా..! అయితే మీరు వీటిని పాటించడం లేదు..?

Samantha: ‘మంచి జరగబోతుందని గుర్తుపెట్టుకోండి’… వైరల్ అవుతోన్న సమంత పోస్ట్