Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..

Jyoti Nooran-Sultan Nooran: కొంతమంది గురించి పూర్తిగా తెలియకుండా ఎదో చిన్న చిన్న విషయాలను పట్టుకుని అంచనా వేస్తె బోల్తాపడతారు అనడానికి ఉదాహరణగా నిలుస్తారు..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..
Jyoti Nooran
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2021 | 7:30 PM

Jyoti Nooran-Sultan Nooran: కొంతమంది గురించి పూర్తిగా తెలియకుండా ఎదో చిన్న చిన్న విషయాలను పట్టుకుని అంచనా వేస్తె బోల్తాపడతారు అనడానికి ఉదాహరణగా నిలుస్తారు ఈ గాయనీమణులు.  ఆ గాయనీ విచిత్రంగా పాడిన వీడియోలతో పాటు, కామెడీ మీమ్స్ ను చూసిన వారు ఆమె గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఆ గాయనీ మని గొంతు ఎందరినో ఆకర్షించింది. ఆమె తెలివి తేటలకు మేథావులు సైతం ఫిదా.. తన గానంతో అనేక అవార్డులను సైతం గెలుచుకుంది.  విచిత్రంగా పాడిన అనేక వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి కూడా ఆ  గాయని పేరు జ్యోతి నూరన్.

అవును చాలా మందికి జ్యోతి నూరన్ ట్రోల్ వీడియోల గురించి మాత్రమే తెలుసు. అయితే  జ్యోతి గొంతు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. ఏఆర్ రెహమాన్‌కి కూడా ఇష్టం. జ్యోతి నూరన్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరం. తన సోదరి సుల్తానా నూరాన్‌తో కలిసి, ఆమె చాలా సందర్భాలలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.  ఈ ఇద్దరి అక్కచెల్లెలకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు.  జ్యోతి గాత్రానికి ముగ్ధుడైన ఎ.ఆర్.  రెహమాన్‌.. తన హైవే సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు.  ‘హైవే’ చిత్రంలోని ‘పటాకా గుడ్డీ ..’ పాటకు అలియా భట్ కు గాత్రదానం చేసింది. ఆ తర్వాత చాలా బాలీవుడ్ సినిమాల్లో పాడింది. అనంతరం జ్యోతి, సుల్తానాలకు పలు ఆఫర్లు వెల్లువెత్తాయి. తను వెడ్స్ మను రిటర్న్స్, సింగ్ ఈజ్ బ్లింగ్, ధమ్ లగాకే హైషా, సుల్తాన్, దంగల్, టైగర్ జిందా హై, భారత్ వంటి సినిమాల్లో జ్యోతిక పాడింది.

హైవే’ సినిమాలోని ‘పట్టాఖ గుడ్డి’ పాటకు జ్యోతి ,సుల్తానా నూరన్ లు 2014 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో  బెస్ట్ సింగర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు.  2015, 2017లో జ్యోతి-సుల్తానా పాడిన రెండు పాటలు ‘ఇండీ పాప్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకున్నాయి.

జ్యోతి నూరన్ సంగీత విద్వాంసు కుటుంబానికి చెందినది. జ్యోతి తండ్రి , తాత సూఫీ సంగీతంలో నిష్ణాతులు.ఉస్తాద్ గుల్షన్ స్వరకర్త మరియు అమ్మమ్మ బీబీ నూరన్ ఒక జానపద పంజాబీ గాయకుడు. సోదరీమణులు చాలా చిన్న వయస్సులోనే పాడటం ప్రారంభించారు .చిన్నతనంలో జ్యోతి, సుల్తానా లు తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు.  సోదరీమణులు చాలా చిన్న వయస్సులోనే పాడటం ప్రారంభించారు. ఇప్పుడు జ్యోతి బాలీవుడ్, పంజాబీ సినిమాల్లో పాటలు పాడుతూ తన గాత్రంతో అలరిస్తూనే ఉన్నారు.

Also Read:

విధి నిర్వహణలో తెగువను ప్రదర్శించిన తమిళనాడు లేడీ సూపర్ పోలీస్‌కు ప్రశంసల వెల్లువ..

 మావోలకు షాక్.. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత భార్యతో సహా అరెస్ట్..

  హైదరాబాద్ రోడ్ల అభివృద్దికి స్థల సేకరణ వేగవంతం.. GHMC కీలక నిర్ణయం..

విప్లవ సాహిత్యం ప్రింటింగ్ అవుతుందనే సమాచారంతో ప్రింటింగ్ ప్రెస్ లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు