NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…
NTR's EMK Contestant: జూ. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరుడు. ఈ షోలో అత్యధికంగా కోటి రూపాయలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి..
NTR’s EMK Contestant: జూ. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరుడు. ఈ షోలో అత్యధికంగా కోటి రూపాయలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకూ ఏ పార్టిసిపెంట్ కూడా కోటి రూపాయల ప్రశ్న వరకూ చేరుకోలేదు. అయితే తొలిసారిగా ఈ షోలో ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్న వరకూ రీచ్ అవ్వడమేకాదు.. సమాధానం చెప్పి.. కోటి గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షో నిర్వాహకులు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.
వెండితెరపై స్టార్ హీరోగా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోవైపు బుల్లి తెరపై హోస్ట్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కు హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో తో రీ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన శైలిలో మాటల తూటాలతో హాట్ సీట్ లో కూర్చున్న వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఈ షోలో ఇప్పటి వరకూ హాట్ సీట్ లో కూర్చుకున్న ఎవరు కూడా కోటి ప్రశ్న వరకూ చేరుకోలేదు. అయితే తొలిసారిగా ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానము చెప్పినట్లు తెలుస్తోంది.
తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి కోటి రూపాయలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోని షో నిర్వాహకులు రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమోలో విజేత వివరాలను ఫోటోని హైడ్ చేశారు. త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నారు.
రామ్ చరణ్ తో మొదలైన ఈ షో సామాన్యుల కోసం రూపొందించింది. అయితే అప్పుడప్పుడు సెలబ్రెటీలు కూడా ఈ షోలో గెస్టులుగా హాజరవుతూ సందడి చేస్తుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, సమంత, కొరటాల శివ, రాజమౌళి వంటి వారు అనేక మంది షోలో సందడి చేశారు. త్వరలో మహేష్ బాబు గెస్ట్ గా హాజరైన షో కూడా ప్రసారం కానున్నదని తెలుస్తోంది.
Also Read: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..
కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆదివాసి జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..