Rashmika Mandanna: అందుకే కదా నేషనల్ క్రష్ అనేది.. రష్మిక సింప్లిసిటికి ఫ్యాన్స్ ఫిదా.. అభిమానులు అడగ్గాన్నే ఏం చేసిందంటే..
తాజాగా ముంబై విమానాశ్రయంలో రష్మిక చేసిన పనికి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. క్యాజువల్ లుక్లో ఉన్న రష్మిక విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ఆమెను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరారు.
కిరిక్ పార్టీ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ చిన్నది… ఆ తర్వాత దక్షిణాదిలో వరుస ఆఫర్లు అందుకుంది. అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలిచింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటుంది. అభిమానులు ఎంతో ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు యానిమల్, మిస్టర్ మజ్ను, గుడ్ బై, పుష్ప 2 సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా రష్మిక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న యానిమల్ చిత్రీకరణలో పాల్గోంటుంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో రష్మిక చేసిన పనికి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. క్యాజువల్ లుక్లో ఉన్న రష్మిక విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ఆమెను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరారు.
సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ షేర్ చేసిన వీడియోలో రష్మికను కలిసేందుకు ఆమె వద్దకు చేరుకున్నారు అభిమానులు. వారితో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అలాగే చిన్నపిల్లల అభిమానులను దగ్గరకు తీసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఆమె డౌన్ టు ఎర్త్ అని.. ఎంతో సింప్లిసిటీ.. నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే పుష్ప 2 చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రంలో శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.